Ravi Pillai: రూ.100 కోట్లకు ల‌గ్జరీ హెలికాప్టర్‌ కొన్న మొద‌టి భార‌తీయుడు.. దీని స్పెషలిటీ ఏమిటంటే..!

| Edited By: Janardhan Veluru

Mar 23, 2022 | 11:25 AM

Luxury Helicopter: వంద కోట్ల విలువైన లగ్జరీ హెలికాఫ్టర్‌ కొనుగోలు చేసిన తొలి భారతీయుడు( India) గా నిలిచారు రవి పిళ్లై (B Ravi Pillai). కేర‌ళ‌(Kerala) కు చెందిన ఆర్‌పీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల..

Ravi Pillai: రూ.100 కోట్లకు ల‌గ్జరీ హెలికాప్టర్‌ కొన్న మొద‌టి భార‌తీయుడు.. దీని స్పెషలిటీ ఏమిటంటే..!
B Ravi Pillai
Follow us on

Luxury Helicopter: వంద కోట్ల విలువైన లగ్జరీ హెలికాఫ్టర్‌ కొనుగోలు చేసిన తొలి భారతీయుడుగా నిలిచారు రవి పిళ్లై (B Ravi Pillai). కేర‌ళ‌(Kerala) కు చెందిన ఆర్‌పీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల చైర్మన్ బీ ర‌విపిళ్లై రూ.100 కోట్ల విలువైన ఎయిర్‌బస్‌ హెచ్‌- 145 హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు. ఇంత‌ లగ్జరీ చాపర్‌ను సొంతం చేసుకున్న మొదటి భారతీయుడిగా పిళ్లై నిలిచారు. ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,500 హెచ్‌-145 చాప‌ర్లు మాత్రమే తిరుగుతున్నాయి. కాగా, మార్చి 20 ఆదివారం రోజున ఈ హెలిక్యాప్టర్‌లో ఆర్‌పీ గ్రూప్స్‌ వైస్ చైర్మన్.. కోవ‌లం నుంచి ది ర‌విజ్ అష్టముడి ఫైవ్‌స్టార్ హోట‌ల్‌ వ‌ర‌కు ప్రయాణించారు. 68 ఏళ్ల బిలియనీర్ ర‌విపిళ్లై సంప‌ద‌ విలువ‌ ప్రస్తుతం $2.5 బిలియన్ డాల‌ర్లు. రవిపిళ్లైకి చెందిన‌ వివిధ కంపెనీల్లో సుమారు 70,000 మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. ఆయ‌న యూఏఈ నుంచి కార్యకలాపాల‌ను నిర్వహిస్తున్నారు.

కాగా, హెచ్‌-145 హెలికాప్ట‌ర్‌ అత్యాధునిక భ‌ద్రతా ఫీచ‌ర్లను క‌లిగి ఉంటుంది. ఇందులో పైలెట్‌తోపాటు ఏడుగురు ప్రయాణికులు ప్ర‌యాణించొచ్చు. ఈ హెలికాప్టర్ స‌ముద్ర మ‌ట్టానికి 20,000 అడుగుల ఎత్తునుంచి కూడా ల్యాండింగ్‌, టేకాఫ్ చేయ‌గ‌ల‌దు.

Also Read: Vastu Tips: ఇంట్లో సుఖ సంపదలు ఎల్లపుడూ ఉండాలంటే పూజగది విషయంలో ఈ టిప్స్ పాటించండి

Former MLA: రెండేళ్ల తర్వాత కూతురు స్కూల్‌కి వెళ్తుంటే.. కొత్తకారులో బ్యాండ్ బాజాలతో సాగనంపిన తండ్రి ప్రేమ