Azad Hind Formation Anniversary: ఆజాద్ హింద్ సర్కార్ ఏర్పడింది ఈ రోజే.. తెల్లవారి గుండెళ్లో గునపాలు దింపిన రోజు..

|

Oct 21, 2021 | 11:59 AM

Subhash Chandra Bose: భారతదేశ చరిత్రలో ఓ మరుపురాని రోజు.. మరిచిపోలేని రోజు. బ్రిటిష్ పాలకులకు వణుకుపుట్టిన రోజు. తెల్లవారిపై పోరాడి గెలిచిన రోజు. అదే అక్టోబర్ 21. ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది.

Azad Hind Formation Anniversary: ఆజాద్ హింద్ సర్కార్ ఏర్పడింది ఈ రోజే.. తెల్లవారి గుండెళ్లో గునపాలు దింపిన రోజు..
Azad Hind Formation
Follow us on

భారతదేశ చరిత్రలో ఓ మరుపురాని రోజు.. మరిచిపోలేని రోజు. బ్రిటిష్ పాలకులకు వణుకుపుట్టిన రోజు. తెల్లవారిపై పోరాడి గెలిచిన రోజు. అదే అక్టోబర్ 21. ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సరిగ్గా ఈ రోజున అంటే 1943 అక్టోబర్ 21 ఈ రోజున ఆజాద్ హింద్ ఫౌజ్ అధినేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిని జర్మనీ, జపాన్, ఫిలిప్పీన్స్, కొరియా, చైనా, ఇటలీ, మంచుకువో, ఐర్లాండ్‌తో సహా 11 దేశాల ప్రభుత్వాలు గుర్తించాయి. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి జపాన్ అండమాన్ నికోబార్ దీవులను ఇచ్చింది. జపాన్, జర్మనీల సహకారంతో సాయుధ మార్గంలో భారత్‌కు విముక్తి కల్పించాలని సంకల్పించారు. అదే క్రమంలో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేశారు. నేతాజీ ఆ దీవులకు వెళ్లి వాటికి మళ్లీ పేరు పెట్టారు. ఈ ప్రభుత్వాన్ని ఆజాద్ హింద్ సర్కార్ అని పిలుస్తారు. ఈ ప్రభుత్వం తన సైన్యం నుండి బ్యాంకు వరకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఆజాద్ హింద్ ఫౌజ్‌లో రాష్ట్రపతి, ప్రధాని, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రులను సుభాస్ బోస్ ఏర్పాటుచేశారు. దేశ నిర్మాణం నుంచి అనేక స్థాయి వ్యక్తులను నియనించారు. బ్రిటిష్ వారిని వారి స్నేహితులను భారతదేశం నుండి బహిష్కరించడం తాత్కాలిక ప్రభుత్వం  పనిగా పెట్టుకుంది. భారతీయుల కోరిక మేరకు వారి విశ్వాసం మేరకు ఆజాద్ హింద్ శాశ్వత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో పడింది నేతజీ సైన్యం. తాత్కాలిక ప్రభుత్వంలో సుభాష్ చంద్రబోస్ ప్రధాన మంత్రి అయ్యారు. విదేశీ వ్యవహారాల మంత్రి కూడా అయ్యారు. ఇది కాకుండా ఈ ప్రభుత్వంలో మరో ముగ్గురు మంత్రులను ఏర్పాటు చేశారు. 16 మంది సభ్యులతో ఓ కోర్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు.

బోస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని జర్మనీ, జపాన్, ఫిలిప్పీన్స్, కొరియా, ఇటలీ, మంచుకువో, ఐర్లాండ్ ప్రభుత్వాలు గుర్తించాయి. జపాన్ ఆధీనంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులను తాత్కాలిక ప్రభుత్వా ఏర్పాటు కోసం నేతాజీ ఇచ్చింది. వెంటనే నేతాజీ ఆ దీవులకు చేరుకున్నారు. ఆ దీవులకు కొత్త పేరు పెట్టారు. అండమాన్ పేరును షహీద్ ద్వీప్ అని నామకర్ణం చేశారు. నికోబార్ పేరును స్వరాజ్య ద్వీపం అని మార్చారు. 30 డిసెంబర్ 1943 న ఈ ద్వీపాలలో స్వతంత్ర భారతదేశం జెండా కూడా ఎగురవేశారు.

దీంతో బ్రిటీష్ సర్కార్ ఫోకస్ ఫెట్టింది. నేతాజీ పాలనలో ఉన్న ప్రాంతాలపై యుద్ధం ప్రకటించింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత నేతాజీ మరో పిలుపునిచ్చారు. బ్రిటషర్లను, వారి తొత్తులను ఎదిరించేందుకు “ఛలో ఢిల్లీ” అంటూ పిలిపునిచ్చారు. భారత్‌లోని బ్రిటన్ పాలకులపై ఇండో- బర్మా సరిహద్దులో యుద్ధం ప్రకటించారు. ఇంఫాల్-కోహిమా సెక్టార్‌లో కూడా జపాన్ సేనలతో కలిసి ఆజాద్ సైన్యం పోరాటం చేసింది. ఓటమి చవిచైసిన బ్రిటీష్ సైన్యం ఆలోచనల్లో పడింది. ఇక భారత్‌ను ఎక్కవ రోజులు పాలించలేమనే భావన తెల్లవారు పడిపోయేలా చేసింది. బ్రిటషర్ల దాడులను వెంటనే తిప్పి కొట్టారు ఆజాద్ సైన్యం. ఇలా ఇంఫాల్, కోహిమా సరిహద్దులలో అనేక సార్లు భారత బ్రిటిష్ సైన్యం యుద్ధంలో ఆజాద్ హింద్ ఫౌజ్ చేతిలో ఓడిపోయింది. 

ఇవి కూడా చదవండి: Fuel Rate: వాహనదారులు అదిరిపోయే వార్త.. రూ. 60కే లీటర్ పెట్రోల్.. భారీ యాక్షన్‌ ప్లాన్‌తో రంగంలోకి కేంద్రం..

Sainik School Admission 2022: సైనిక్ స్కూల్ అడ్మిషన్ షెడ్యూల్ వచ్చింది.. తేదీల వివరాలు, దరఖాస్తు చేయడం ఎలానో తెలుసుకోండి..