Ayodhya: అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై కీలక సమావేశం.. భక్తులకు అనుమతి ఎప్పుడో వెల్లడించిన ట్రస్ట్‌

Ayodhya Rama Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న రామ మందిరంలో 2023 చివరి నాటికి పూజల కోసం భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాత్‌..

Ayodhya: అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై కీలక సమావేశం.. భక్తులకు అనుమతి ఎప్పుడో వెల్లడించిన ట్రస్ట్‌

Edited By:

Updated on: Jul 16, 2021 | 2:54 PM

Ayodhya Rama Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న రామ మందిరంలో 2023 చివరి నాటికి పూజల కోసం భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాత్‌ తెలిపారు. మొత్తం 70 ఎకరాల్లో రామాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పూర్తి నిర్మాణం 2025 చివ‌రిలోగా పూర్తి కానున్నట్లు ట్రస్ట్‌ ఆఫీసర్‌ బేరర్లు వెల్లడించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌లోని 15 మంది సభ్యులు రెండు రోజుల సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. గత సంవత్సరం ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ ఆలయం కోసం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే గత జనవరిలో ఆలయం నిర్మించబోయే ప్రాంతంలో దిగువన నీళ్లు రావడంతో నిర్మాణాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం ఇంజనీర్లు ఆలయ పునాదిపై పని చేస్తున్నారు. అయితే సెప్టెంబర్‌ 15 నాటికి ఇది పూర్తి కానుంది. దీపావళి సమయంలో రెండో దశ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

కాగా, అయోధ్యలో రామాలయం నిర్మాణ ఖర్చు అంచనా వివరాలను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లించిన విషయం తెలిసిందే. అయోధ్య రామాలయ నిర్మాణానికి రూ.1,100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయోధ్య ప్రధాన ఆలయానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలిపింది. అయోధ్యలో రామాలయాన్ని మూడున్నరేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. నిపుణుల సారథ్యంలో ఆలయ ఆకృతులు రూపకల్పన జరుగుతుందన్నారు.

ఇవీ కూాడా చదవండి

Brahmamgari Matam: మరో మలుపు తిరిగిన బ్రహ్మంగారి మఠం వివాదం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

Tirumal Hundi: తిరుమల శ్రీవారి హుండీలో పాకిస్తానీ కరెన్సీ.. ఆశ్చర్యపోయిన అధికారులు..