అయోధ్యలో కరోనా కలకలం రేపుతోంది. ఆగస్గు 5వ తేదీన ఓ వైపు రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అయోధ్య నగరంలో కరోనా టెన్షన్ పెడుతోంది. రామజన్మభూమి మందిర పూజారాకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మరో 16 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో అక్కడి పూజారులు, పోలీసులు ఆందోళనలకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన ప్రభుత్వాధికారులు.. అయోధ్య ప్రాంతంలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. కాగా, ఆగస్టు 5వ తేదీన జరిగే భూమి పూజ కార్యక్రామనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 200 మందితో ఈ భూమి పూజ కార్యక్రమం జరగబోతోంది.
Read More
భవనంలో భారీ పేలుడు.. 16 మందికి గాయాలు