స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పే ఓ మాస్టారూ.. పాడుపని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. బాయ్స్ హాస్టల్‌లో పని చేస్తున్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని.. ఆమెతో శృంగారం సాగిస్తూ విద్యార్ధుల కంటపడ్డాడు. కట్ చేస్తే.. జైలులో ఊసలు లెక్కపెడుతున్నాడు. ఈ ఘటన ఛతీస్‌గడ్‌లో చోటు చేసుకుంది. చివరికి ఏం జరిగిందంటే.? దాని వివరాల్లోకి వెళ్తే..
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా ఉప్రోడాకు చెందిన ఓ బాయ్స్ హాస్టల్‌లో ప్రదీప్ కుమార్ అనే అసిస్టెంట్ టీచర్.. అందులో ఉన్న విద్యార్ధులకు పాఠాలు చెబుతుండేవాడు. అతడు కొద్దిరోజులుగా అక్కడే పని చేస్తోన్న ఓ మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో సందు దొరికినప్పుడల్లా శృంగారం సాగిస్తుండేవాడు. ఈ నెల 22వ తేదీ రాత్రి 9.30 గంటలకు ఆ మహిళను హాస్టల్ సూపరింటెండెంట్ గదికి అసిస్టెంట్ టీచర్ ప్రదీప్ తీసుకెళ్లాడు. దీన్ని హాస్టల్ వాచ్‌మెన్, విద్యార్ధులు గమనిస్తారు. సరిగ్గా రాత్రి 11.30కి ఆమెతో శృంగారం సాగిస్తుండగా వీరు ఆ గదికి బయట నుంచి తాళం వేసి.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. కాగా, ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రదీప్‌తో పాటు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ విషయం జిల్లా విద్యాధికారి వరకు వెళ్లడంతో.. ఆయన దీనిపై విచారణ జరిగి సదరు అసిస్టెంట్ టీచర్ ప్రదీప్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.