Assembly Election Results 2022: ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దూసుకుపోతోంది. ఇక పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ జోరుమీదుంది. ఇక గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో (Elections) కొందరు ప్రముఖులకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పోటీలో ఉన్న ముఖ్యమంత్రులే వెనుకంజలో ఉన్నారు.
ఇక ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్, కర్హాల్‌లో అఖిలేష్ యాదవ్‌లు ఆధిక్యంలో ఉన్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సాక్విలిమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం వెలువడిన ఫలితాల్లో ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ధర్మేష్ సగ్లానీ కంటే వెనుకంజలో ఉన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ చామ్‌కౌర్ సాహిద్, భదౌర్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో ఆప్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి ఖతిమా నుంచి పోటీ చేయగా, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిపై దామి వెనుకంజలో ఉన్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ పాటియాలాలో వెనుకంజలో ఉండగా, ఉత్తరాఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ లాల్‌కువా నియోజకవర్గంలో వెనుకంజలో ఉండటం గమనార్హం.
ఇవి కూడా చదవండి: