CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌‌పై కేసు నమోదు చేయనున్న అస్సాం పోలీసులు.. మరింత ముదురుతున్న వివాదం..

|

Feb 15, 2022 | 3:21 PM

CM KCR - Himanta Biswa Sarma: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (KCR), అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మధ్య వివాదం తారాస్థాయికి చేరుతోంది. ఇప్పటికే.. సీఎం కేసీఆర్, అస్సాం సీఎంలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు.

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌‌పై కేసు నమోదు చేయనున్న అస్సాం పోలీసులు.. మరింత ముదురుతున్న వివాదం..
Himanta Biswa Sarma Cm Kcr
Follow us on

CM KCR – Himanta Biswa Sarma: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (KCR), అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మధ్య వివాదం తారాస్థాయికి చేరుతోంది. ఇప్పటికే.. సీఎం కేసీఆర్, అస్సాం సీఎంలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఈ వివాదంపై మరింత ముదిరి కేసుల వరకు వెళుతోంది. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma).. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఖండించిన విషయం తెలిసిందే. రాహుల్.. రాజీవ్ గాంధీ (Rahul Gandhi) కుమారుడే అన్న విషయానికి రుజువులు చూపాలని బీజేపీ ఎప్పుడైనా అడిగిందా అంటూ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ (CM KCR) ఘాటుగా స్పందించారు. అస్సాం సీఎంను పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని బీజేపీ (BJP)ని డిమాండ్ చేశారు. భారత స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు రాహుల్‌ గాంధీ కుటుంబ సభ్యులు ప్రాణాలు ఇచ్చారని.. అలాంటి వారిపై ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. ఇదేనా ధర్మం, హిందూత్వం అంటూ మండిపడ్డారు సీఎం కేసీఆర్. కాగా.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు అస్సాం సీఎం కౌంటర్ ఇచ్చారు. సర్జికల్ స్ట్రయిక్‌పై రాహుల్ ఆధారాలు అడిగారు.. బిపిన్ రావత్‌పై వ్యాఖ్యలు చేశారంటూ అసోం సీఎం పేర్కొన్నారు. అలాంటి వ్యక్తులపై మాట్లాడకుడదా అంటూ ప్రశ్నించారు. గాంధీ కుటుంబంపై విమర్శలు చేయకుడదా అంటూ హిమంత బిశ్వ శర్మ ప్రశ్నించారు. కేసీఆర్‌కు తాను మాట్లాడిందే తప్పులా అనిపించిందా..? అంటూ అస్సాం సీఎం వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో అస్సాం సీఎంపై హైదరాబాద్‌లో కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన (Telangana Police) పోలీసులు తెలిపారు. అయితే.. తెలంగాణలో అస్సాం సీఎంపై కేసు నమోదైన నేపథ్యంలో అక్కడి పోలీసులు కూడా.. సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేశారు. పలువురు బీజేపీ మద్దతుదారుల నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా.. సర్జికల్ స్ట్రైక్‌కు రుజువు కావాలని డిమాండ్ చేయడం, తద్వారా భారత వ్యతిరేక భావాలను ప్రోత్సహించేలా ఆర్మీని ప్రశ్నించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని భావిస్తున్నట్లు అస్సాం పోలీసు (Assam Police) వర్గాలు తెలిపినట్లు వార్త సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.

Also Read:

Bjp vs Trs: ముఖ్యమంత్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఇలాంటి పరిస్థితి కొత్తగా చూస్తున్నామంటూ..

YS Sharmila: వైఎస్‌ షర్మిల అరెస్ట్‌.. స్టేషన్ లోనే దీక్ష కొనసాగిస్తోన్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు..