Vultures: ఒకేసారి వంద రాబందుల మృతి.. ప్రాణాపాయ స్థితిలో మరికొన్ని.. అసలేమైందంటే..

|

Mar 19, 2022 | 7:28 AM

Assam Vultures Dead: ప్రకృతిని కాపాడటంలో రాబందులు ఎంతో కీలకం. దాదాపు అవి అంతరించిపోతున్నాయి. ఉన్న కొన్నింటినైనా కాపాడాలంటారు నిపుణులు. కానీ, వాటిపై కక్ష తీర్చుకునే పనిచేశారు

Vultures: ఒకేసారి వంద రాబందుల మృతి.. ప్రాణాపాయ స్థితిలో మరికొన్ని.. అసలేమైందంటే..
Vultures
Follow us on

Assam Vultures Dead: ప్రకృతిని కాపాడటంలో రాబందులు ఎంతో కీలకం. దాదాపు అవి అంతరించిపోతున్నాయి. ఉన్న కొన్నింటినైనా కాపాడాలంటారు నిపుణులు. కానీ, వాటిపై కక్ష తీర్చుకునే పనిచేశారు కొందరు దుర్మార్గులు. దీనివల్ల ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా వంద రాబందులు చనిపోయాయి. ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అసోంలో రాబందులు మృత్యువాతపడటం కలకలం రేపుతోంది. కమ్రూప్ జిల్లా (Kamrup district) లోని ఛయ్‌గావ్ ప్రాంతంలో దాదాపు వంద రాబందులు చనిపోయాయి. ఇంకొన్ని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. మిలన్‌పూర్ ప్రాంతంలో రాష్ట్ర అటవీ శాఖ అధికారులు సుమారు వంద రాబందుల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. ఒకేసారి ఇన్ని రాబందులు చనిపోవడం ఇదే మొదటసారని చెబుతున్నారు, కమ్రూప్ వెస్ట్ ఫారెస్ట్ డివిజన్‌కు చెందిన జిల్లా అటవీ అధికారి డింపి బోరా.

రాబందులు చనిపోయిన గొర్రె కళేబరాన్ని తిన్నాయని, అందుకే అవి చనిపోయాయని అనుమానిస్తున్నారు అటవీశాఖ అధికారులు. ఆ మాంసం విష‌పూరితంగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే రాబందుల మృతికి క‌చ్చిత‌మైన కార‌ణం పోస్టుమార్టం నివేదిక‌లో వెల్లడి కానుంది. రాబందుల కళేబరాల దగ్గర గొర్రె ఎముకలు కొన్ని దొరికాయని, విషపూరితమైన గొర్రె కళేబరాన్ని తిని రాబందులు చనిపోయాయని అనుమానంగా ఉందన్నారు అధికారులు. పోస్టుమార్టం నివేదికలో మరణానికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని చెప్పారు. ఒక వేళ గొర్రె కళేబరంలో ఎవరైనా విషం కలిపితే, అది పెద్ద నేరం అంటున్నారు ఆఫీసర్లు.

ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తామని చెప్పారు అటవీ అధికారి డింపి బోరా. స్థానికులు ఎవరో కావాలనే గొర్రెల మాంసంలో విషం కలిపారని అంటున్నారు అధికారులు. అలాగే ఈ ఏడాది ప్రారంభంలోనూ ఇలాంటి ఘ‌ట‌నే జరిగింది. కానీ, గతంలో కంటే ఇప్పుడు పెద్ద సంఖ్యలో రాబందులు చనిపోయాయని అంటున్నారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా అవగాహన కల్పిస్తామని స్పష్టం చేస్తున్నారు అధికారులు.

Also Read:

Russia Ukraine War: మూడు వారాల తర్వాత స్వదేశానికి చేరుకోనున్న న‌వీన్ మృత‌దేహం.. ఎప్పుడంటే..?

PM Narendra Modi: ప్రధాని మోడీనే నెంబర్‌వన్.. గ్లోబల్ లీడర్‌గా మరో రికార్డు తిరగరాసిన నమో..