మొన్న కోల్కతాలో.. నిన్నముంబైలో.. ఇవి కేవలం వెలుగులోకి వచ్చిన ఘటనలు మాత్రమే.. వెలుగుచూడని సంఘటనలు ఇంకెన్నో.. ముక్కుపచ్చలారని చిన్నారుల నుంచి పండు ముసలి వరకు ఆడదైతే చాలు.. అన్న చందంగా అఘాయిత్యాలు.. రోజుకో దారుణం వెలుగుచూస్తోంది. తాజాగా మరో ఆటవిక ఘటన చోటుచేసుకుంది. అసోంలోని నాగాం జిల్లాలో అత్యంత పాశవికంగా.. ఒళ్లు గగుర్పొడిచే తీరులా ఘాతుకానికి ఒడిగట్టారు. ఎందుకీ వికృత చేష్టలు.. ఇదీ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న మహిళలపై అత్యాచారాలు, హత్యలపై నిత్యం చూస్తూ.. వింటూ.. విసిగి వేసారిపోతున్నారు జనం.
ముక్కుపచ్చలారని బాలిక..చదువుకునేందుకు వెళ్లి ట్యూషన్ అయిపోయాక ఇంటికి వస్తున్న సమయంలో మాటు వేసి ముగ్గురు మానవ కృరమృగాలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అసోంలోని నాగావ్ జిల్లాలో చోటు చేసుకుంది. సేఫ్ ఇంటికి తిరిగొస్తదనుకున్న తల్లిదండ్రులకు ప్రాణాపాయస్థితిలో ఇంటికి చేరుకుంటే తల్లిదండ్రుల పడ్డ వేదన అంతా ఇంత కాదు. కట్టలు తెంచుకున్న ఆవేశం రోడ్లపైకి వచ్చింది. అసోం వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. మానవ మృగాలు ఆకృత్యాలను నిలదీస్తున్నాయి.
ఇదిలాఉండగా, ఈ కేసులో కీలక నిందితుడు ఈ ఉదయం కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తఫుజల్ ఇస్లామ్‌గా గుర్తించిన నిందితుడిని తెల్లవారుజామున 4 గంటలకు క్రైమ్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నేరం జరిగిన ప్రదేశానికి తీసుకువెళుతున్నారు. ఆ తర్వాత పోలీసుల అదుపు నుంచి తప్పించుకుని అసోంలోని నాగావ్ జిల్లాలోని డింగ్ వద్ద చెరువులో దూకాడు. సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన రెండు గంటల తర్వాత స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సహాయంతో అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ట్యూషన్ ముగించుకుని గురువారం (ఆగస్టు 22) సాయంత్రం ఇంటికి వస్తున్న 14ఏళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచారం చేసిన ఘటన అసోంలోని నాగావ్ జిల్లా ఢింగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. మరొకరి కోసం గాలిస్తున్నారు.
బాలికపై అత్యాచారంపై అసోం వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని వర్గాల ప్రజలు శుక్రవారం రోడ్లపైకి వచ్చారు. వ్యాపారస్తులు స్వచ్ఛంగా షాపులు మూసి వేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక, రాజకీయ నేతలు డిమాండ్ చేస్తూ నిరసనల్లో పాల్గొన్నారు. బాలికలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..