
అస్సాంలోని చిరాంగ్ జిల్లాలో జరిగిన ఒక భయానక సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక 60ఏళ్ల వ్యక్తి తన భార్య తలను నరికేశాడు. అంతటితో ఆగలేదు.. ఆ తలను తన సైకిల్ బుట్టలో పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లోంగిపోయాడు. అది చూసిన పోలీసులు, సిబ్బంది సైతం ఒక్కసారిగా భయపడిపోయారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది, భార్యాభర్తల మధ్య గొడవ తీవ్రమైంది, ఫలితంగా ఈ భయంకరమైన సంఘటన జరిగింది. షాక్‌కు గురైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
చిరాంగ్‌కు జిల్లాకు చెందిన 60 ఏళ్ల బితీష్ హజోంగ్, తన భార్య బైజంతి తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. చివరకు బితీష్ కోపంతో పదునైనా ఆయుధం తీసుకుని భార్య బైజంతి తల నరికేశాడు. ఆపై తన సైకిల్ బుట్టలో ఆ తలను పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించి లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
ఈ భయానక సంఘటన ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. జరిగిన దారుణం తెలిసిన ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. హజోంగ్, అతడి బైజంతి మధ్య తరచుగా గొడవలు జరిగేవని చుట్టుపక్కల వారు చెప్పారు. ప్రతిరోజూ చిన్న చిన్న విషయాలకే ఇద్దరు గొడవ పడేవారని చెప్పారు. కానీ, ఇంట్లో జరిగే చిన్నపాటి గొడవలకే ఇంత దారుణమైన పనిచేస్తాడని ఎవరూ ఊహించలేదని అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.