Amit Shah: ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి.. తన వెయిట్ లాస్ సీక్రెట్ చెప్పేసిన కేంద్రమంత్రి!
తన వెయిట్ లాస్ జర్నీ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. శరీరానికి అవసరమైన మేర నిద్ర, మంచి ఆహారం, నీరు తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నానని ఆయన తెలిపారు. ఇవి పాటించడం వల్ల జీవితంలో చాలా సాధించానని చెప్పుకొచ్చారు. ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ILBSలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ లివర్ రిహాబిలిటేషన్ సెంటర్‌తో పాటు కాలేయ ఆరోగ్యంపై వేసిన కార్టూన్ల పుస్తకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఆరోగ్యం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన వెయిట్ లాస్ జర్నీ వెనుక రహస్యాన్ని దేశ ప్రజలకు తెలియజేశారు. శరీరానికి అవసరమైన మేర నిద్ర, మంచి ఆహారం, నీరు తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నానని ఆయన తెలిపారు. ఇవి పాటించడం వల్ల..జీవితంలో తానెంతో సాధించానని, నాలుగున్నరేళ్లలో అల్లోపతి మందులను పూర్తిగా వేసుకోవడం మానేశానని తెలిపారు. “దేశంలోని యువత” వారి ఆరోగ్యంపై చురుకుగా దృష్టి పెట్టాలని ప్రేరేపించారు. తద్వారా వారు “మరో 40–50 సంవత్సరాలు జీవించి దేశ పురోగతికి దోహదపడగలరని ఆయన అన్నారు. యువత రోజుకు రెండు గంటల వ్యాయామం, ఆరు గంటల నిద్ర వంటి పద్దతులను పాటించడం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చని అమిత్ షా అన్నారు. ఇలా చేయడం వల్ల మన పనితీరు, ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడతాయని ఆయన తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఉజ్వల యోజన, ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలు ప్రజల ఆరోగ్యం కోసం ఉద్దేశించినవని హోంమంత్రి వివరించారు. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల ఏర్పాటు వంటి పథకాలు కూడా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఆరోగ్య రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించిందని ఆయన తెలిపారు. 2014లో రూ. 37,000 కోట్లుగా ఉన్న కేంద్ర ఆరోగ్య శాఖ బడ్జెట్… ఇప్పుడు రూ. 1.27 లక్షల కోట్లకు పెరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
