రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై ఏ హోటల్‌, రెస్టారెంట్‌లోనూ బీఫ్‌ దొరుకదు..!

|

Dec 05, 2024 | 2:33 PM

గోహత్య నిషేధ చట్టం తీసుకొచ్చి మూడేళ్లు ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అసోం సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగంగా బీఫ్ వినియోగంపై నిషేధం విధించింది.

రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై ఏ హోటల్‌, రెస్టారెంట్‌లోనూ బీఫ్‌ దొరుకదు..!
Assam Beef Ban
Follow us on

అసోంలోని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో బీఫ్ మాంసం వడ్డించడం నిషేధించింది. ఈ సందర్భంగా హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, “అసోంలోని రెస్టారెంట్, హోటల్‌లో గొడ్డు మాంసం వడ్డించకూడదని నిర్ణయించుకున్నట్లు సీఎం తెలిపారు. అంతేకాదు ఏ పబ్లిక్ ఫంక్షన్ లేదా పబ్లిక్ ప్లేస్‌లో కూడా వడ్డించకూడదని పేర్కొన్నారు. ఈ రోజు నుండి బహిరంగంగా బీఫ్ అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. రెస్టారెంట్, హోటల్‌తోపాటు బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసోంలో గోహత్య నిషేధ చట్టం తీసుకొచ్చి 3 ఏళ్లు పూర్తవుతున్నాయన్నారు. ఈ చట్టం ద్వారా గోహత్యలో చాలా విజయం సాధించామని, ఇకపై ఏ పబ్లిక్ ఫంక్షన్‌లోనూ బీఫ్ వినియోగించకుండా నిషేధం ఉంటుందని సీఎం తెలిపారు. అలాగే దేవాలయానికి 5 కిలోమీటర్ల పరిధిలో మాంసం తినడం లేదా అమ్మడంపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లిక్ ఫంక్షన్లలో గొడ్డు మాంసం వండకూడదు లేదా తినకూడదు. ఇది పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు.

ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నిర్ణయం తర్వాత పిజూష్ హజారికా అస్సాం కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఒక ప్రకటన కూడా ఇచ్చారు. అస్సాం గొడ్డు మాంసం నిషేధాన్ని అస్సాం కాంగ్రెస్ స్వాగతించాలని లేదా పాకిస్తాన్‌కు వెళ్లాలని పిజూష్ హజారికా ఎక్స్‌లో రాశారు. ఈ పోస్ట్‌లో సీఎం హిమంత బిస్వా శర్మ విలేకరుల సమావేశానికి సంబంధించిన ఫుటేజీని షేర్ చేస్తూ, పిజూష్ హజారికా ఈ ప్రకటన చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..