Earthquake in Assam: భూకంపాలతో ఈశాన్య రాష్ట్రం అస్సాం చిగురుటాకులా వణికిపోతోంది. రెండు రోజులుగా వరుసగా సంభవిస్తున్న భూకంపాలతో అస్సాం ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 13 సార్లు భూప్రకంపనలు సంభవించాయి. తాజాగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం 2.30 గంటల వరకు వరుసగా సోనిత్‌పూర్‌లో ఆరుసార్లు భూప్రకంపనలు సంభవించాయని అధికారులు పేర్కొన్నారు. కాగా స్వల్పంగా ప్రకంపనలు రావడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. దీంతో ప్రజలంతా ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. వరుస భూకంపాలతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వారంతా నిద్రపోకుండా జాగరం చేస్తూ గడిపారు.
అర్ధరాత్రి మొదట 12.02 గంటల ప్రాంతంలో 2.6 తీవ్రతతో భూమి కంపించింది. తేజ్‌పూర్‌కు 18 కిలోమీటర్ల దూరంలో, 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఆ తర్వాత 1.10 గంటలకు 2.6 తీవ్రతతో, 1.20 గంటలకు 4.6 తీవ్రతతో, 1.41 గంటలకు మరోసారి 2.3, 1.52 గంటలకు 2.7 తీవ్రతతో స్వల్ప ప్రకంపనలు రికార్డయ్యాయి. చివరి సారిగా 2.38 గంటలకు 2.7 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.
ఇదిలాఉంటే.. అస్సాంలో మొదటగా.. బుధవారం ఉదయం 7.51 గంటలకు 6.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సోనిత్‌పూర్ జిల్లా ప్రధాన కేంద్రమైన తేజ్‌పూర్‌లో భూకంపం సంభవించగా.. బెంగాల్‌లో తదితర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఈ భారీ భూకంపంతో పలుచోట్ల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇద్దరు మరణించారు. 10 మందికిపైగా గాయపడ్డారు.
Also Read: