Assam Election 2021: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న అస్సాం అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. 47 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఎన్నికల సంఘం ప్రకారం.. సాయంత్రం 6 గంటల వరకు 72.14 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే పోలింగ్ సమయం ముగిసినా.. క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు ఎన్నికల అధికారులు. కోవిడ్–19 కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యంలో.. అన్ని భద్రతా చర్యల నడుమ పోలింగ్ కొనసాగుతోంది. ప్రతీ పోలింగ్ కేంద్రం దగ్గర థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. శానిటైజర్లు ఉంచారు. పరీక్షలో ఎవరికైనా జ్వరం ఉందని తేలితే వారిని సాయంత్రం ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి తీరాలన్న నిబంధనలున్నాయి.
అస్సాంలో తొలి దశలోనే ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఎందరో విపక్ష నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ మజూలి నుంచి తిరిగి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నేత రజీబ్ లోచన్ పెగు ఈ నియోజకవర్గం నుంచి 2001 నుంచి వరసగా మూడు సార్లు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో సోనోవాల్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ సారి మళ్లీ వీళ్లిద్దరే తలపడుతున్నారు. జోర్హత్ నుంచి అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాథ్ పోటీ పడుతున్నారు.
అసోం రాష్ట్రంలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేసేందుకు క్యూలైన్‌లో ఉన్నవారిని సాయంత్రం ఆరు గంటల వరకు ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. 47 స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 72.14 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.కోవిడ్–19 కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యంలో.. అన్ని భద్రతా చర్యల నడుమ పోలింగ్ కొనసాగుతోంది. ప్రతీ పోలింగ్ కేంద్రం దగ్గర థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.
అసోంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే సాయంత్రం వరకే ముగియగా, క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు ఎన్నికల అధికారులు. సాయంత్రం 6 గంటల వరకు 72.14 శాతం పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
72.14% and 79.79% voter turnout recorded till 6 pm, in the first phase of polling in Assam and West Bengal Assembly elections, respectively: Election Commission of India.
— ANI (@ANI) March 27, 2021
అసోంలో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు.
అసోంలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 71.62 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
71.62% and 77.99% voter turnout recorded till 5 pm, in the first phase of polling in Assam and West Bengal Assembly elections, respectively: Election Commission of India. pic.twitter.com/ph1BWtMXMV
— ANI (@ANI) March 27, 2021
పశ్చిమబెంగాల్‌లో 70.17 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పశ్చిమబెంగాల్ ఇంకా తొలి విడుత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది.
అసోంలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు 62.36 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
అసోంలో 12 జిల్లాల్లో 47 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు 47.10 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తొలి విడతలో 264 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
असम और पश्चिम बंगाल विधानसभा चुनाव के प्रथम चरण में दोपहर 3 बजे तक 47.10% और 55.27% मतदान हुए: चुनाव आयोग
— ANI_HindiNews (@AHindinews) March 27, 2021
అస్సాం అసెంబ్లీకి జరుగుతోన్న తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం రెండు గంటల వరకు 45.24 శాతం పోలింగ్ పూర్తయిన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మొదట దశలో భాగంగా జరుగుతోన్న పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
24.48 and 24.61% voter turnout recorded till 11 am, in the first phase of polling in Assam and West Bengal Assembly elections, respectively: Election Commission of India pic.twitter.com/mmLiqmMaDi
— ANI (@ANI) March 27, 2021
అస్సాం అసెంబ్లీకి జరుగుతోన్న తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రముఖులు ఒక్కొక్కరుగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు అస్సాంలో 37.06 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
It’s a very emotional moment for me as it’s the first time after many yrs that I’m coming to a polling station without my parents. Confident that people are going to vote out politics of lies & deceit & voting for politics that guarantees that their future is bright: Gaurav Gogoi pic.twitter.com/1ybYHGSEn0
— ANI (@ANI) March 27, 2021
అస్సాంలో జరుగుతోన్న తొలి దశ ఎన్నికల్లో ఓటింగ్ హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన గొగోయ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇది ఎంతో భావోద్వేగంతో కూడిన సమయం. చాలా ఏళ్ల తర్వాత నేను నా తల్లిదండ్రులు లేకుండా పోలింగ్ బూత్‌కు వచ్చాను. ప్రజలు అబద్ధాలు, నిజాయితీ లేని రాజకీయాలకు దూరంగా ఉంటూ.. వారి ఉజ్వల భవిష్యత్తు కోసం పనిచేసే నాయకుడికి ఓటు వేస్తారనే నమ్మకం నాకు ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.
24.48 and 24.61% voter turnout recorded till 11 am, in the first phase of polling in Assam and West Bengal Assembly elections, respectively: Election Commission of India pic.twitter.com/mmLiqmMaDi
— ANI (@ANI) March 27, 2021
దేశం దృష్టిని ఆకర్షిస్తోన్న అస్సాం అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు 24.48 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. మొదటి దశలో భాగంగా జరుగుతోన్న ఈ ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది.
Assam CM Sarbananda Sonowal casts his vote a polling centre in Dibrugarh
“We will get more than 100 seats,” CM says pic.twitter.com/nHpEdNpVss
— ANI (@ANI) March 27, 2021
అస్సాం అసెంబ్లీకి జరుగుతోన్న తొలి దశ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వానంత సోనోవాల్ మజూలి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిబ్రూగర్‌లోని పోలింగ్ బూత్‌లో ముఖ్యమంత్రి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మేము వందకుపైగా సీట్లను గెలుచుకోబోతున్నాం’ అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అస్సాం ఎన్నికల నేపథ్యంలో మాట్లాడారు. అస్సాం ప్రజలు రాష్ట్ర అభివృద్ధి, తమ బంగారు భవిష్యత్తు కోసం ఓటు వేయాలని ప్రియాంక గాంధీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
దేశం దృష్టిని ఆకర్షిస్తున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా కొనసాగుతోంది. తొలి దశలో ఇవాళ 47 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. తొలి దశ పోలింగ్ జరగనున్న స్థానాల్లో 81.09 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలోనే పటిష్ట భ్రదతా నడుమ ఎన్నికలను నిర్వహిస్తున్నారు.
8.84% and 7.72% voter turnout recorded till 9 am, in the first phase of polling in Assam and West Bengal Assembly elections, respectively: Election Commission of India
(Visuals from a polling centre in Patashpur, East Midnapore District, West Bengal) pic.twitter.com/mi51MHElor
— ANI (@ANI) March 27, 2021
అస్సాంలో తొలి దశ అసెంబ్లీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఉదయం 9 గంటల వరకు మొత్తం 8.84 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదిలా ఉంటే మొదటి దశలో ఈ రోజు రాష్ట్రంలోని 47 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోన్న విషయం తెలిసిందే.
కరోనా మహమ్మారి పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే మజులిలోని కమలా బారి జూనియర్ స్కూల్‌లో ఏర్పాట్లపై ఓ లుక్కేయండి. ఇదిలా ఉంటే అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఈ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన గతంలోనూ ఇదే స్థానం నుంచి పోటీకి దిగారు.
#AssamAssemblyPolls: Voters follow physical distancing at polling station set up at Kamala Bari Junior Basic School, Majuli pic.twitter.com/agupM24oBc
— ANI (@ANI) March 27, 2021
অসম বিধানসভা নিৰ্বাচনৰ আজি প্ৰথম পৰ্যায়ৰ ভোটদান অনুষ্ঠিত হ’ব। ভোটদাতা ৰাইজে যেন গণতন্ত্ৰৰ এই উৎসৱত ভাগ লৈ সৰ্বাধিক ভোট প্ৰদানেৰে নতুন অভিলেখ গঢ়ে, তাৰ বাবে অনুৰোধ জনালোঁ। মুখচ্ছদ পৰিধান আৰু সামাজিক দূৰত্ব বজাই ৰখাৰ দিশতো যেন বিশেষ মনোযোগ দিয়া হয়।
— Jagat Prakash Nadda (@JPNadda) March 27, 2021
అస్సాం అసెంబ్లీ మొదటి దశ పోలింగ్‌లో పెద్ద ఎత్తున జనాలు పాల్గొనాలని బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పవిత్ర ఉత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన అన్నారు. ఓటింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాలని ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కోరారు. ఇక పోలింగ్ స్టేషన్లకు వచ్చే ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని సూచించారు. జెపి నడ్డా ఈ విషయాన్ని బెంగాళీ భాషలో ట్వీట్ చేయడం విశేషం.
#AssamAssemblyPolls: A long queue of voters at a polling centre in Rupahi, Nagaon District pic.twitter.com/1elWsnnKZt
— ANI (@ANI) March 27, 2021
ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. నాగాన్ జిల్లాలోని రూపహి పోలింగ్ కేంద్రానికి ఓటర్లు బారులు తీరారు. విధులకు వెళ్లే ముందు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది.
It is each Indian’s duty to uphold the foundations of our nation: its democracy.
And the best way to do it, Vote!#CongressKeVichaar pic.twitter.com/lRKHeq9NTP
— Congress (@INCIndia) March 27, 2021
ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ప్రజాస్వామ్య మూలాలను కాపాడుకోవాల్సిన బాధ్య అందరిపై ఉందని. దీనికి ఉత్తమమైన మార్గం ఓటు వేయడమే’ అంటూ ట్వీట్ చేశారు.
The first phase of elections begin in Assam. Urging those eligible to vote in record numbers. I particularly call upon my young friends to vote.
— Narendra Modi (@narendramodi) March 27, 2021
అస్సాం తొలి దశ పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘అస్సాం తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. అర్హత ఉన్న ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోండి. ముఖ్యంగా యువ ఓటర్లు ఎంతో విలువైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి’ అంటూ ట్వీట్ చేశారు.
Assam: Preparations underway at a polling station in Rupahi, Nagaon district, ahead of voting for the first phase of #AssamAssemblyPolls today.
Visuals from Rupahi Higher Secondary School pic.twitter.com/OTI3sbct0u
— ANI (@ANI) March 27, 2021
అస్సాం అసెంబ్లీ మొదటి దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఫేస్ ఫీల్డ్స్ వేసుకొని విధులకు హాజరయ్యారు. ఇక 47 స్థానాలకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.