AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwini Vaishnaw: భారత్‌లో చిప్ మేకర్ AMD 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులు.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన సంస్థ ప్రతినిధులు

ఐదేళ్లలో భారతదేశంలో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. AMD ఇండియా కంట్రీ హెడ్, సెమికాన్ టాలెంట్ బిల్డింగ్ కమిటీ సభ్యురాలు జయ జగదీష్ కేంద్ర మంత్రిని కలిశారు. బెంగళూరు ఏర్పాటు చేయనున్న AMD కార్యాలయం ఏర్పాటుపై పూర్తి వివరాలను అందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ... భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి, ఇంజనీరింగ్ కార్యకలాపాలను..

Ashwini Vaishnaw: భారత్‌లో చిప్ మేకర్ AMD 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులు.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన సంస్థ ప్రతినిధులు
Ashwini Vaishnaw Says Amd Ready To Set Up
Sanjay Kasula
|

Updated on: Oct 26, 2023 | 8:58 PM

Share

ప్రముఖ చిప్ మేకర్, టెక్నాలజీ కంపెనీ AMD వచ్చే ఐదేళ్లలో భారతదేశంలో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. AMD ఇండియా కంట్రీ హెడ్, సెమికాన్ టాలెంట్ బిల్డింగ్ కమిటీ సభ్యురాలు జయ జగదీష్ కేంద్ర మంత్రిని కలిశారు. బెంగళూరు ఏర్పాటు చేయనున్న AMD కార్యాలయం ఏర్పాటుపై పూర్తి వివరాలను అందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ… భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి, ఇంజనీరింగ్ కార్యకలాపాలను మరింత విస్తరించడానికి AMD బెంగళూరులో కొత్త AMD క్యాంపస్‌ను ప్రారంభించనుందని వెల్లడించారు. ఈ క్యాంపస్ కంపెనీకి అతిపెద్ద డిజైన్ సెంటర్‌గా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి క్యాంపస్‌ను ప్రారంభించనున్నట్లుగా తెలిపారు.

AMD 2028 చివరి నాటికి దాదాపు 3,000 కొత్త ఇంజనీరింగ్  విభాగాలను జోడిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కొత్త కేంద్రం ప్రారంభమవుతుందని కంపెనీ ఇప్పటికే తెలిపింది. ఇది విస్తృతమైన ల్యాబ్‌లు, అధునాతన సహాయ పరికరాలు, టీమ్‌వర్క్‌ను ప్రోత్సహించడానికి రూపొందించబడిన సీటింగ్ ఏర్పాట్లు కలిగి ఉంటుచేయనుంది.  భారతదేశంలో తమ అతిపెద్ద R&D డిజైన్ సెంటర్‌ను బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. AMD భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు AMD తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.

అధిక నైపుణ్యం కలిగిన సెమీకండక్టర్ ఇంజనీర్లు, పరిశోధకుల పెద్ద సమూహానికి ఇది అద్భుతమైన అవకాశాలను కూడా అందిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్  చెప్పారు. సెమీకండక్టర్ పరిశ్రమపై దృష్టి సారించే కేంద్ర ప్రభుత్వం వివిధ విధాన కార్యక్రమాలు ఈ పెట్టుబడికి మద్దతు ఇస్తున్నాయని అన్నారు.

దేశంలోని ఈ నగరాల్లో AMDకి కార్యాలయాలు..

కొత్త 5,00,000 చదరపు అడుగుల బెంగళూరు క్యాంపస్ AMD కార్యాలయ ఏర్పాటు చేయడంతోపాటు.. దేశంలోని మరికొన్ని నగరాల్లో మొత్తం 10 స్థానాలకు విస్తరిస్తుంది. ఇందులో బెంగళూరుతోపాటు ఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, ముంబై నగరాల్లో ఏర్పాటు చేయనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ