Ashwini Vaishnaw: కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పరిశీలించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్.. ఫొటోలు చూస్తే వావ్ అనాల్సిందే..

Vande Bharat train: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్)ని సందర్శించి వందే భారత్ రైళ్ల కొత్త రూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సరికొత్తగా నిర్మించిన వందే భారత్ రైళ్లను అశ్విని వైష్ణవ్ పరిశీలించారు.

Ashwini Vaishnaw: కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పరిశీలించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్.. ఫొటోలు చూస్తే వావ్ అనాల్సిందే..
Ashwini Vaishnaw - New Vande Bharat Express

Updated on: Jul 08, 2023 | 9:23 PM

Vande Bharat train: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్)ని సందర్శించి వందే భారత్ రైళ్ల కొత్త రూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సరికొత్తగా నిర్మించిన వందే భారత్ రైళ్లను అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు వందే భారత్ రైలుకు 25 మెరుగుదలలు చేశామని తెలిపారు. సరికొత్తగా ఆవిష్కరించేందుకు ఆధునాతన సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఫీల్డ్ యూనిట్ నుంచి తమకు అందుతున్న అన్ని ఇన్‌పుట్‌లను పొందుపరుస్తోందని వివరించారు.

New Vande Bharat Trains

అంతకుముందు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌ను కూడా వైష్ణవ్ సమీక్షించారు. రైళ్లలో అన్ని ఎయిర్ కండిషన్డ్, ఎగ్జిక్యూటివ్ తరగతులలో అమలు చేసిన రాయితీ ఛార్జీల గురించి కూడా కేంద్ర మంత్రి మాట్లాడారు. వైష్ణవ్ మాట్లాడుతూ ఈ తగ్గింపులు కొత్త మెరుగుదల కాదని, గతంలో చాలా సంవత్సరాలుగా అమలు చేస్తున్నారని తెలిపారు. అన్ని ఎగ్జిక్యూటివ్ తరగతులతో పాటు ఏసీ చైర్ కార్ల ధరలు 25 శాతం వరకు తగ్గుతాయని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కొత్త అమలు పథకంలో వందే భారత్ కూడా భాగమని అశ్విని వైష్ణవ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కాకుండా, అన్ని వారసత్వ మార్గాల గుండా ప్రయాణించే రైలును త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ రైళ్లకు ‘హెరిటేజ్ స్పెషల్’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని రైళ్లను చేర్చనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే దీనిని స్టీమ్ ఇంజన్ సహాయంతో తయారు చేయనున్నారు. వచ్చే నెలలో పర్యాటకులకు అందుబాటులోకి రాకముందే, ఈ రైలును మొదట వారసత్వ మార్గాలలో తనిఖీ చేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..