PM Modi: అప్పుడు.. ఇప్పుడు ఒకటే మాట.. ప్రధాని మోదీ 26 ఏళ్ల నాటి కల ‘మేకిన్ ఇండియా’.. ఇదిగో సాక్ష్యం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాజస్థాన్‌ పర్యటిస్తున్నారు. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో 'భారత్ శక్తి' ప్రదర్శనను వీక్షించారు. జైసల్మేర్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో త్రివిధ దళాల స్వదేశీ ఆయుధాల శక్తి ప్రదర్శనను ఆయన చూశారు. ఈ ప్రదర్శన స్వదేశీ ఆయుధాల మందుగుండు శక్తిని, త్రివిధ దళాల కార్యాచరణ సంసిద్ధతను ప్రదర్శిస్తోంది.30కి పైగా దేశాల ప్రతినిధులతో ప్రధాని మోదీ ఈ లైవ్ ఫైర్‌ను ఆస్వాదించారు. అ..

PM Modi: అప్పుడు.. ఇప్పుడు ఒకటే మాట.. ప్రధాని మోదీ 26 ఏళ్ల నాటి కల 'మేకిన్ ఇండియా'.. ఇదిగో సాక్ష్యం..
Pm Modi
Follow us
Subhash Goud

|

Updated on: Mar 12, 2024 | 3:41 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాజస్థాన్‌ పర్యటిస్తున్నారు. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ‘భారత్ శక్తి’ ప్రదర్శనను వీక్షించారు. జైసల్మేర్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో త్రివిధ దళాల స్వదేశీ ఆయుధాల శక్తి ప్రదర్శనను ఆయన చూశారు. ఈ ప్రదర్శన స్వదేశీ ఆయుధాల మందుగుండు శక్తిని, త్రివిధ దళాల కార్యాచరణ సంసిద్ధతను ప్రదర్శిస్తోంది.30కి పైగా దేశాల ప్రతినిధులతో ప్రధాని మోదీ ఈ లైవ్ ఫైర్‌ను ఆస్వాదించారు. అయితే మోడీ గతంలో చెప్పినట్లుగానే మేక్ ఇన్ ఇండియాను చూసి చూపించారు.

‘భారత్ శక్తి’ ప్రదర్శన, ట్రై-సర్వీస్ ఫైరింగ్, ప్రదర్శనను చూసేందుకు ఈ రోజు పోఖ్రాన్‌ను సందర్శించారు. అయితే నేడు రక్షణ రంగంలో భారతదేశం ఆత్మనిర్భరలో పురోగతి సాధించడం మనమందరం చూస్తున్నాము. కానీ 26 సంవత్సరాల క్రితం కూడా ప్రధాన నరేంద్ర మోడీ పోఖ్రాన్‌ను సందర్శించి విజన్, మిషన్ గురించి స్పష్టంగా తెలియజేశారు. ఆ సమయంలో 100% మేక్ ఇన్ ఇండియా సాధించనున్నట్లు చెప్పారు. అయితే ప్రధాన నరేంద్ర మోడీ అప్పుడు.. ఇప్పుడు ఒకటే మాటపై ఉన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా కల గురించి 26 ఏళ్ల కిందటే మాట్లాడారు. అనుకున్నది సాధించారు.

అయితే 1998లో పోఖ్రాన్‌లో భారతదేశం విజయవంతమైన అణు పరీక్షను పురస్కరించుకుని బీజేపీ కార్యకర్తగా నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎలాగైనా మేక్‌ ఇన్‌ ఇండియాను సాధిస్తామని చెప్పగా, ఇప్పుడు ఆ కల సాకరమైందనే చెప్పాలి. ఇందులో కార్యక్రమంలో పాల్గొన్న భారతీయులు, శాస్త్రవేత్తలు దేశంలో ఎలా విద్యావంతులు అవుతారో స్పష్టంగా చెప్పారు. వారిలో ఒకరైన ఏపీజే అబ్దుల్ కలాం ఇంగ్లీషుతో పాటు తమిళ మాధ్యమంలో కూడా చదువుకున్నారు అంటూ ఆనాడే మేక్‌ ఇన్‌ ఇండియా గురించి ప్రస్తావించారు. 1998లో విజయవంతమైన పోఖ్రాన్ పరీక్షలకు దారితీసిన శాస్త్రవేత్తలకు, వారి ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అత్యుత్తమ రాజకీయ ధైర్యం, రాజనీతిజ్ఞతను కనబరిచిన అటల్ జీ ఆదర్శప్రాయమైన నాయకత్వాన్ని గర్వంగా గుర్తుచేసుకున్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలు రాజస్థాన్‌లోని థార్‌లోని భారత సైన్యం పోఖ్రాన్ టెస్ట్ రేంజ్ వద్ద నిర్వహించిన ఐదు అణు బాంబు పరీక్ష పేలుళ్లు జరిగాయి. పరీక్షల తర్వాత న్యూక్లియర్ క్లబ్‌లో చేరిన ఆరో దేశంగా భారత్ అవతరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి