PM Modi: ప్రధాని మోదీ రెండు రోజుల మారిషస్ పర్యటన.. ఆనాడే ‘మినీ ఇండియా’ అంటూ..

మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులం ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 11-12 తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం(మార్చి 12) పోర్ట్ లూయిస్‌లో జరిగే ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరవుతారు.

PM Modi: ప్రధాని మోదీ రెండు రోజుల మారిషస్ పర్యటన.. ఆనాడే మినీ ఇండియా అంటూ..
Narendra Modi

Updated on: Mar 10, 2025 | 6:13 PM

మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులం ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 11-12 తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం(మార్చి 12) పోర్ట్ లూయిస్‌లో జరిగే ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరవుతారు. ఈ క్రమంలోనే రెండు దేశాల ప్రధానుల మధ్య పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. రెండు దేశాల స్నేహ సంబంధాలను మరింతగా పెంచేలా ఈ సమావేశం సాగనుందని తెలుస్తోంది.

90వ దశకం నుంచి భారత్, మారిషస్ చరిత్ర, సంస్కృతిక, భాష, హిందూ మహాసముద్రం చుట్టూ సాగే లోతైన బంధాన్ని పంచుకుంటున్నాయి. ఇక ప్రజాప్రతినిధిగా లేని సమయంలోనే నరేంద్ర మోదీ.. మారిషస్‌తో సత్సంబంధాలను ఏర్పర్చుకున్నారు. 1998లో ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో మారిషస్‌లో పర్యటించారు. ఇక ఇప్పుడు మళ్లీ ప్రధానమంత్రిగా వెళ్లనున్నారు. ఆనాడు మారిషస్‌తో తనకున్న స్నేహబంధాన్ని మోదీ పంచుకోవడమే కాదు.. ఆ దేశాన్ని ‘మినీ ఇండియా’ అంటూ సంబోధించారు.

శతాబ్దం క్రితం, ఎంతోమంది భారతీయులు ఆ దేశానికి కార్మికులుగా వెళ్లారు. తులసీదాస్ ‘రామాయణం’, ‘హనుమాన్ చాలీసా’, హిందీ భాషా లాంటివి వారితో పాటు తీసుకెళ్లారు. నరేంద్ర మోదీ మొదటిసారి మారిషస్‌ను సందర్శించినది 1998లో.. అంటే దాదాపుగా 27 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి మారిషస్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఆ సమయంలో మోదీ ప్రజాప్రతినిధిగా లేరు.. కానీ బీజేపీ కోసం అవిశ్రాంతంగా పనిచేశారు.

మీకు తెలుసా? 1998 అక్టోబర్ 2-8 తేదీలలో మారిషస్‌లో మోకా గ్రామంలో జరిగిన ‘అంతర్జాతీయ రామాయణ సమావేశం’లో ప్రసంగించారు నరేంద్ర మోదీ. అప్పుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, రాముడి సార్వత్రిక విలువల గురించి, రామాయణం.. భారతదేశం, మారిషస్‌ను ఎలా ఒకటి చేసిందో ఆయన మాట్లాడారు. ఈ పర్యటనలో ఆయన మురళీ మనోహర్ జోషిని కలిశారు.

ఆ సమయంలో మారిషస్‌లోని ప్రజలతో మాట్లాడటమే కాదు.. వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని, ఇప్పటికీ తన స్నేహ బంధాన్ని కొనసాగించారు. అప్పటి అధ్యక్షుడు కాసమ్ ఉతీమ్ , ప్రధాన మంత్రి నవీన్‌చంద్ర రాంగులమ్, ప్రతిపక్ష నాయకుడు సర్ అనిరూద్ జుగ్నాథ్ వంటి కీలక నాయకులతో ఆయన సమావేశమయ్యారు. మారిషస్ స్వాతంత్ర్య పోరాటం.. భారతదేశం స్వాతంత్ర్య పోరాటాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో నరేంద్ర మోదీ అర్థం చేసుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా, మారిషస్‌ను స్వేచ్ఛ వైపు నడిపించిన నాయకుడిని సత్కరిస్తూ సర్ సీవూసాగర్ రాంగులమ్‌కు ఆయన నివాళులర్పించారు.