అధికారుల నిర్లక్ష్యం వల్లే కరోనా ఉధృతి.. అంతర్జాతీయ సాయంపై కేంద్రాన్ని నిలదీసిన మజ్లిస్ అధినేత ఓవైసీ

|

May 05, 2021 | 10:34 PM

Owaisi Comments: దేశంలోని కరోనా పరిస్థితి, అంతర్జాతీయ సహాయంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కేంద్రాన్ని...

అధికారుల నిర్లక్ష్యం వల్లే కరోనా ఉధృతి.. అంతర్జాతీయ సాయంపై కేంద్రాన్ని నిలదీసిన మజ్లిస్ అధినేత ఓవైసీ
Follow us on

Owaisi Comments: దేశంలోని కరోనా పరిస్థితి, అంతర్జాతీయ సహాయంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. “బ్యూరోక్రాటిక్ డ్రామా కారణంగా మెడికల్ కిట్లు, టాబ్లెట్లు, ఇతరత్రా నిల్వలు ఇంకెన్ని స్టోరేజీలలో చిక్కుకున్నాయని” ఓవైసీ అడిగారు.

కరోనాపై పోరాటంలో భాగంగా భారతదేశానికి కనీసం 300 టన్నుల అంతర్జాతీయ సాయం లభించింది. అదంతా ఏమైందన్న విషయాన్ని ప్రధాని కార్యాలయం చెప్పడం లేదని ఓవైసీ ఆరోపించారు. అంతర్జాతీయ సాయంలో ఎక్కువ శాతం కస్టమ్స్ క్లియరెన్స్ రాకపోవడంతో విమానాశ్రయాల్లోనే నిలిచిపోయిందని.. అలాగే కరోనా ఉధృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఓవైసీ ట్వీట్ చేశారు.

ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించిన తర్వాత.. 3 వేల ఆక్సిజన్ సాంద్రతలు కస్టమ్స్ అధికారుల వద్ద పెండింగ్‌లో లేవని సోమవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ న్యాయస్థానానికి తెలిపింది. అత్యవసర వైద్య పరికరాల కస్టమ్స్ క్లియరెన్స్ కోసం సీబీఐసీ ఇటీవల తీసుకున్న పలు చర్యలు లాజిస్టిక్స్ కంపెనీలకు కరోనా వైరస్ సంబంధిత అత్యవసర ఉత్పత్తుల దిగుమతులను వేగంగా పంపిణీ చేయడంలో సహాయపడుతుందని తెలుస్తోంది. కాగా, ఆక్సిజన్ సాంద్రతలు, రెమ్‌డెసివిర్‌లపై పన్ను మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.