CM Wife Corona Positive: ముఖ్యమంత్రి భార్యకు కరోనా పాజిటివ్.. సెల్ఫ్ క్వారంటైన్‌లో ముఖ్యమంత్రి..

|

Apr 20, 2021 | 4:11 PM

CM Wife Corona Positive: దేశ రాజధాని ఢిల్లీని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. చివరికి కరోనా సెగ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ...

CM Wife Corona Positive: ముఖ్యమంత్రి భార్యకు కరోనా పాజిటివ్.. సెల్ఫ్ క్వారంటైన్‌లో ముఖ్యమంత్రి..
Cm Wife Corona Positive
Follow us on

CM Wife Corona Positive: దేశ రాజధాని ఢిల్లీని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. చివరికి కరోనా సెగ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కూడా తాకింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీత కేజ్రీవాల్‌ మంగళవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సునీత కేజ్రీవాల్‌కు కరోనా స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆమె టెస్ట్ చేయించుకున్నట్లు తెలిసింది. ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత సంవత్సరం జూన్‌లో సీఎం కేజ్రీవాల్‌కు కూడా కోవిడ్-19 లక్షణాలు కనిపించాయి. కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదిలా ఉంటే.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా భార్యకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెను చికిత్స నిమిత్తం గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు తరలించారు.

అయితే ఆయన భార్యకు సునీత కేజ్రీవాలకు కరోనా తేలడంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కూడా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సోమవారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చిన ఆరు రోజుల లాక్‌డౌన్‌ సందర్భంగా ఇంట్లోనే ఉండాలని కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. అయితే ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన వెల్లడించారు. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నంఉచి సెలబ్రెటీల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. 73 సంవత్సరాల సీనియర్ కాంగ్రెస్ నేత భూపేందర్ సింగ్, ఆయన భార్య ఢిల్లీలో ఉంటున్నారు. భూపేందర్‌కు కూడా జ్వరం రావడంతో ఆయనకు, ఆయన భార్యకు కరోనా టెస్టులు చేయగా.. ఆయన భార్యకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఇదిలా ఉంటే.. ఢిల్లీలో కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రజలంతా వీలైనంత వరకూ ఇళ్లలోనే ఉండాలని సీఎం కేజ్రీవాల్‌ కోరారు. ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రకటన చేసిన సందర్భంలో సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 23,500 కరోనా కేసులు నమోదయ్యాయని సీఎం చెప్పారు. పాజిటివిటీ రేటు, వైరస్ వ్యాప్తి పెరిగిందని కేజ్రీవాల్ తెలిపారు. పెళ్లిళ్ల వంటి వేడుకలకు 50 మంది కంటే ఎక్కువగా హాజరవకూడదని, పెళ్లి వేడుక చేసుకునేవారికి ప్రత్యేకంగా పాసులు మంజూరు చేయనున్నట్లు సీఎం చెప్పారు.
అయితే ఢిల్లీలో ఉన్న వలస కార్మికులకు కూడా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఓ అభ్యర్థన చేశారు. ఇది పరిమిత లాక్‌డౌన్ మాత్రమేనని, కేవలం ఆరు రోజులేనని తెలిపారు. దయచేసి ఎవరూ ఢిల్లీ వదిలి వెళ్లవద్దని ఆయన కోరారు. ఈ లాక్‌డౌన్‌ను పొడిగించాల్సిన పరిస్థితి రాదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ఇవీ చదవండి: కరోనా భయాలు – వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు, కర్ఫ్యూ, లాక్‌డౌన్‌.. ఏయే రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు ఉన్నాయంటే..!

Covid19: కరోనా సెకండ్ వేవ్‌కు ఈ వైరస్సే కారణమా..?.. ప్రభుత్వం చెబుతున్నదేంటి..? పరిశోధకులు చెబుతున్నదేంటి..?