Delhi News in Telugu: లిక్కర్ స్కాం, మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా అరస్టై జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా ఢిల్లీ హైకోర్టు సోమవారం తిరస్కరించింది. జ్యుడీషియల్ కస్టడీని జూలై 6 వరకు పొడిగించింది. ఈ క్రమంలో జైల్లో ఉన్న తన మిత్రుడు, మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాను తలచుకొని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కంటతడి పెట్టారు. పిల్లలకు మంచి విద్యను అందించినందుకే సిసోడియాను బీజేపీ టార్గెట్ చేసిందంటూ కేజ్రీవాల్ ఈ సందర్భంగా విమర్శించారు. మనీష్ సిసోడియాపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు కేజ్రీవాల్. ఢిల్లీలో విద్యావ్యవస్థను సమూలంగా మార్చిన ఘనత సిసోడియేదే అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశంలో బందిపోట్లు స్వేచ్చగా తిరుగుతున్నారని, సిసోడియా లాంటి మంచి వ్యక్తులను మాత్రం జైల్లో వేస్తున్నారంటూ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఢిల్లీలో కొత్త స్కూల్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేజ్రీవాల్.. ఈ సందర్భంగా విద్యారంగానికి సిసోడియా చేసిన సేవలకు గుర్తు చేసుకొని కన్నీరు పెట్టారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించలన్నదే అతని కల అంటూ పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. సిసోడియాను బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు రెండు రోజుల క్రితం కొట్టేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరస్టయిన మనీష్ సిసోడియా.. గత ఫిబ్రవరి నెల నుంచి జైలులోనే ఉన్నారు.
#WATCH | Delhi CM Arvind Kejriwal gets emotional, as he remembers former education minister Manish Sisodia and his work in the area of education, at the inauguration of an educational institution pic.twitter.com/BDGSSbmpbq
— ANI (@ANI) June 7, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..