హస్తినలో పోస్టర్ వివాదం, ‘దమ్ముంటే నన్నూ అరెస్టు చేయండి’, ఢిల్లీ పోలీసులకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఛాలెంజ్

| Edited By: Anil kumar poka

May 16, 2021 | 5:02 PM

దేశంలో కోవిడ్ సంక్షోభాన్ని ప్రధాని మోదీ హ్యాండిల్ చేయడాన్ని విమర్శిస్తూ ఢిల్లీలో పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. వీటిని ఏర్పాటు చేసిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. దమ్ముంటే నన్నూ అరెస్టు చేయండి...

హస్తినలో పోస్టర్ వివాదం, దమ్ముంటే నన్నూ అరెస్టు చేయండి, ఢిల్లీ పోలీసులకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఛాలెంజ్
Arrest Me Too Says Congress Leader Rahul Gandhi
Follow us on

దేశంలో కోవిడ్ సంక్షోభాన్ని ప్రధాని మోదీ హ్యాండిల్ చేయడాన్ని విమర్శిస్తూ ఢిల్లీలో పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. వీటిని ఏర్పాటు చేసిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. దమ్ముంటే నన్నూ అరెస్టు చేయండి అంటూ ట్వీట్ చేశారు. మోదీజీ ! మా పిల్లలకు ఉద్దేశించిన వ్యాక్సిన్ ని విదేశాలకు ఎందుకు పంపారు అని రాసి ఉన్న పోస్టర్లు కొన్ని రోజులుగా కనిపించాయి. వీటిని అతికించినట్టు భావిస్తున్న 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. డిఫెస్ మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ లోని 188 సెక్షన్ కింద మరో 21 కేసులు కూడా వారు నమోదు చేశారు. గత మూడు వారాలుగా దేశంలో రోజూ మూడు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. వందలాది కోవిద్ రోగుల డెడ్ బాడీలు గంగానదిలో తెలియాడుతున్నాయి. అయితే తమ రాష్ట్రాల్లో మరణాల సంఖ్యను యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు తక్కువగా చూపుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా పి.చిదంబరం వంటి మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా తమ ట్వీట్లలో ఈ పోస్టర్ల వివాదాన్ని ప్రస్తావిస్తూ.. ఢిల్లీ పోలీసుల తీరును తప్పు పడుతున్నారు.

అటు పోలీసులు అరెస్టు చేసినవారిలో కొందరు ఆటో డ్రైవర్లు కాగా..మరికొందరు ప్రింటింగ్ ప్రెస్ లో పని చేసే కార్మికులు, ఇంకొందరు రోజువారీ కూలీలని తెలిసింది. వీరిలో నలుగురు కార్మికులు..ఈ పోస్టర్లను అతికించేందుకు ఎవరో తమకు డబ్బులిచ్చారని పోలీసులకు చెప్పారు.

మరిన్ని చదవండి ఇక్కడ : Ward boy rapes Covid patient video: హాస్పిటల్ లో కరోనా పేషేంట్ పై వార్డ్ బాయ్ లైంగిక దాడి వైరల్ వీడియో..

Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణంరాజుకు హై కోర్ట్ షాక్ బెయిల్ నిరాకరణ..!(వీడియో).

 నోయిడాలో మాటలకందని విషాదం.. పెద్ద కొడుక్కి అంత్యక్రియలు చేసొచ్చేలోగా చిన్నకొడుకు మృతి!కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో ..:coronavirus video.