Army Man Tortoise: వరకట్నం చట్ట వ్యతిరేకమైనప్పటికీ మన దేశంలో చాలా చోట్ల ఇదొక ఆచారంగా కొనసాగుతోంది. ఆడ బిడ్డల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు కట్నం ఇవ్వడాన్ని ఒక స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. అయితే సహజంగా మనకు తెలిసినంత వరకు కట్నంగా డబ్బు, బంగారం, ఇళ్లు, కారు ఇలాంటి వాటిని వరుడు తరఫున వారు ఆశిస్తుంటారు. అయితే ఓ ఆర్మీ ఉద్యోగి మాత్రం కట్నంగా విచిత్రమైన జాబితాను బయట పెట్టాడు. ఈ వింత సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాశిక్‌కు చెందిన ఓ వ్యక్తి ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. విధుల్లో భాగంలో అస్సాంలో పనిచేస్తున్న సదరు వ్యక్తికి గత ఫిబ్రవరిలో ఔరంగబాద్‌కు చెందిన ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. కట్న కానుకల్లో భాగంగా అమ్మాయి తల్లిదండ్రులు.. వివాహానికి ముందే రూ. 2 లక్షల విలువైన బంగారం, రూ. 10 లక్షలు నగదు రూపంలో ఇచ్చారు. ఈ క్రమంలోనే తన ఉద్యోగం పర్మినెంట్‌గా మారుతుందని చెప్పి నమ్మించాడు. అయితే ఉద్యోగం పర్మినెంట్ కాకపోగా పైనుంచి అమ్మాయి తరఫు వారికి మరిన్ని డిమాండ్లు పెట్టాడు. ఇందులో భాగంగా తాబేళుతో పాటు 21 గోర్లను, నల్ల కుక్కను వరకట్నంగా అడిగాడు. ఆ తాబేళు విలువ రూ. 5 నుంచి పది లక్షలు ఉండడంతో అమ్మాయి తల్లిదండ్రులు అడిగినంత ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఈ తాబేళు ఇంట్లో ఉంచుకుంటే మంచి జరుగుతుందని భావించిన వరుడు ఇలాంటి వింత డిమాండ్ చేశాడు. అయితే అమ్మాయి తండ్రి వరుడు బంధువులు డిమాండ్ చేసినవి ఇవ్వలేమని తేల్చిచెప్పాడు. దీంతో వివాహం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తాము నిశ్చితార్థానికి ముందు ఇచ్చిన డబ్బు, బంగారాన్ని తిరి ఇచ్చేయాలని అమ్మాయి తరఫు వారు డిమాండ్ చేశారు. కానీ దీనికి అబ్బాయి బంధువులు ససేమిరా అనడంతో.. అమ్మాయి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. దీంతో విషయం తెలిసుకున్న పోలీసులు ఐపీసీ 420, 406లతో పాటు 34 సెక్షన్లపై వరుడితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ ప్రారంభించిన పోలీసులు గోర్లు, కుక్కను ఎందుకు అడిగారన్న దానిపై సమగ్ర విచారణ చేపట్టి మరిన్ని సెక్షన్లు జత చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం, అందులోనూ ఆర్మీలో ఉన్న వ్యక్తి ఇలాంటి మూఢా విశ్వాసాలను నమ్మడం ఏంటని ఈ వార్త తెలిసిన వారు అంటున్నారు.
Also Read: Life Partner : భార్యాభర్తల బంధం కలకాలం ఉండాలంటే ఈ 6 విషయాలు తప్పనిసరి..! ఏంటో తెలుసుకోండి..
Snakebite: అమ్మానాన్న తిడతారని పాము కరిచినా చెప్పలేదు.. పాపం చిన్నారి ప్రాణం..
Credit Cards: ఒకటికంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండటం ప్రయోజనకరమే.. ఎలా అంటే..