Operation Sindoor: అది నిజం కాదు.. గోల్డెన్‌ టెంపుల్‌ వద్ద ఆయుధాలను మోహరించలేదు: ఆర్మీ క్లారిటీ..

ఆపరేషన్‌ సింధూర్ తర్వాత.. పాకిస్తాన్‌ అక్కసుతో రెచ్చిపోయింది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్‌గా చేసుకుంది. డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. అయితే సిక్కులకు పరమ పవిత్రమైన గోల్డెన్‌ టెంపుల్‌ మీద గీత కూడా పడకుండా ఇండియన్‌ ఆర్మీ కాపాడింది. స్వర్ణ దేవాలయానికి రక్షణ కవచంలా నిలిచింది.

Operation Sindoor: అది నిజం కాదు.. గోల్డెన్‌ టెంపుల్‌ వద్ద ఆయుధాలను మోహరించలేదు: ఆర్మీ క్లారిటీ..
Golden Temple

Updated on: May 21, 2025 | 8:06 AM

ఆపరేషన్‌ సింధూర్ తర్వాత.. పాకిస్తాన్‌ అక్కసుతో రెచ్చిపోయింది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్‌గా చేసుకుంది. డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. అయితే సిక్కులకు పరమ పవిత్రమైన గోల్డెన్‌ టెంపుల్‌ మీద గీత కూడా పడకుండా ఇండియన్‌ ఆర్మీ కాపాడింది. స్వర్ణ దేవాలయానికి రక్షణ కవచంలా నిలిచింది. మన ఆపరేషన్ తర్వాత పాక్‌ దాడులకు పాల్పడుతుందని భారత సైన్యం అంచనా వేసింది. మిలటరీ టార్గెట్లతో పాటు పౌరుల నివాసాలు, మతపరంగా ప్రాధాన్యత ఉన్న ప్రార్థనా స్థలాలపై దాడులకు పాల్పడడం ద్వారా…సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే చర్యలు ఉండొచ్చని ఊహించింది. ఈ క్రమంలోనే.. గోల్డెన్‌ టెంపుల్‌ను పాక్‌ లక్ష్యంగా చేసుకోగా.. దాన్ని ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది.. అంతేకాకుండా అదనపు రక్షణ కల్పించింది. అయితే.. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌ నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం ప్రాంగణంలో గగనతల రక్షణ వ్యవస్థలను ఉంచారని వచ్చిన వార్తలపై భారత సైన్యం స్పందించింది.. ఈ వార్తలను తోసిపుచ్చింది. అటువంటి రక్షణ వ్యవస్థలను అక్కడేమీ మోహరించలేదని స్పష్టం చేసింది. పాక్‌ డ్రోన్‌, క్షిపణి దాడులకు ప్రతిస్పందించేందుకు వీలుగా అక్కడ ఆయుధాలను మోహరించేందుకు నిర్వాహకులు అనుమతిచ్చారంటూ ఓ సైనికాధికారి చెప్పిన నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఈ వివరణ ఇచ్చింది.

‘‘స్వర్ణదేవాలయంలో ఎయిర్‌ డిఫెన్స్‌ ఆయుధాలు (AD Guns) మోహరించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీ దర్బార్ సాహిబ్ అమృత్సర్ (స్వర్ణ దేవాలయం) ప్రాంగణంలో ఎటువంటి ఏడీ తుపాకులు లేదా ఇతర ఆయుధ వ్యవస్థలను మోహరించలేదు’’ అని భారత సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది..

అంతకుముందు, నివేదికలను తోసిపుచ్చుతూ.. మందిరం అదనపు ప్రధాన పూజారి, సిక్కుల అత్యున్నత మత సంస్థ, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC), భారత సైన్యానికి ఎటువంటి వైమానిక రక్షణ తుపాకులను మోహరించడానికి అనుమతి ఇవ్వలేదని చెప్పారు.

భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఇటీవల ఉద్రిక్తత పెరిగిన తర్వాత బ్లాక్‌అవుట్ సమయంలో అమృత్‌సర్‌లోని పవిత్ర స్వర్ణ దేవాలయానికి ముప్పు పొంచి ఉందని తాము సమాచారం ఇవ్వగానే అక్కడి పెద్దలు తమకు పూర్తిగా సహకారం అందించారని సైనికాధికారి ఒకరు మీడియాతో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.. లైట్లను ఆర్పివేయడంతోపాటు, ఆలయంలోకి ఆయుధాలు తీసుకెళ్లడానికి గురుద్వార్‌ పర్యవేక్షకుడు సైన్యానికి ప్రత్యేక అనుమతిని ఇచ్చారని చెప్పారు. దీనిపైనే స్పష్టతనిస్తూ ఆలయ కమిటీ, సైన్యం వేర్వేరుగా ప్రకటనలు చేశాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..