Lance Naik Vivek Kumar: చూపరులను కన్నీరు పెట్టిస్తున్న తుది వీడ్కోలు ఫోటో.. లాన్స్ నాయక్ వివేక్‌కు భార్య పెళ్ళినాటి దుస్తుల్లో కన్నీటి వీడ్కోలు..

| Edited By: Anil kumar poka

Dec 13, 2021 | 11:59 AM

Army Chopper Crash: ఈ నెల 8వ తేదీన తమిళనాడులో జరిగిన మిలటరీ హెలికాఫ్టర్ ప్రమాదంలో సిడిఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధుల సహా మొత్తం 11మంది..

Lance Naik Vivek Kumar: చూపరులను కన్నీరు పెట్టిస్తున్న తుది వీడ్కోలు ఫోటో.. లాన్స్ నాయక్ వివేక్‌కు భార్య పెళ్ళినాటి దుస్తుల్లో కన్నీటి వీడ్కోలు..
Lance Naik Vivek Kumar
Follow us on

Army Chopper Crash: ఈ నెల 8వ తేదీన తమిళనాడులో జరిగిన మిలటరీ హెలికాఫ్టర్ ప్రమాదంలో సిడిఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధుల సహా మొత్తం 11మంది జవాన్లు మృతి చెందారు. ప్రమాదంలో మరణించిన వీరులను డీఎన్ఏ ఆధారంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు.  ఈ ప్రమాదంలో మృతి చెందిన వీరులకు కుటుంభ్యులు, సన్నితులు, స్నేహితులు తుది వీడ్కోలు పలుకుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన లాన్స్ నాయక్ వివేక్ కుమార్ అంత్యక్రియల్లో ఆయన భార్య ప్రియాంక ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ ఫోటో చూపరులను కన్నీరు పెట్టిస్తుంది.

హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో లాన్స్‌ నాయక్‌ వివేక్‌ కుమార్‌ అంత్యక్రియలు సైనిక, ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. అయితే తన భర్తకు తుది వీడ్కోలుని వివేక్‌ కుమా ర్‌భార్య ప్రియాంక పెళ్లి నాటి చీరను కట్టుకొని పలికారు. ఈ దృశ్యం పలువురిని కలచివేసింది. తన భర్తను చూసి గర్వపడుతున్నానని.. అయితే తన బిడ్డల భవిష్యత్ కోసం తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం ఉపాధిని కల్పించాలంటూ కన్నీటి మధ్య ప్రభుత్వాన్నీ అభ్యర్ధించారు. తమ పిల్లలను తన భర్త వివేక్ గర్వించేలా పెంచుతానని చెప్పారు. ఇక వివేక్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయంగా  రూ. 5 లక్షలు అందించింది.

తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌లో 14 మంది ప్రయాణిస్తుండగా.. 13మంది మృత్యువాత పడ్డారు. వీరిలో గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనకు బెంగళూరులోని ఆర్మీ కమాండ్ హాస్పిటల్‌లో వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే..

Also Read: పుష్ప రిలీజ్ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్ అల్లువారి వారసులు.. తగ్గేదే లే.. అంటూ అతిధులతో క్లాప్స్ కొట్టించిన అర్హ, అయాన్