బీజేపీని ఎదుర్కొనేందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు ఇతర విపక్షాలతో ఎందుకు చేతులు కలపరు ? సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి

| Edited By: Phani CH

May 25, 2021 | 8:27 PM

బీజేపీని సమైక్యంగా ఎదుర్కొనేందుకు బహుజన్ సమాజ్ పార్టీ, ఆప్ పార్టీల మాదిరి ఏపీ (వైసీపీ), తెలంగాణ (టీఆర్ 0ఎస్ )ముఖ్యమంత్రులు ఇతర విపక్షాలతో ఎందుకు చేతులు కలపడంలేదని సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి ప్రశ్నించారు.

బీజేపీని ఎదుర్కొనేందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు ఇతర విపక్షాలతో ఎందుకు చేతులు కలపరు ? సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి
Sitaram Yechury
Follow us on

బీజేపీని సమైక్యంగా ఎదుర్కొనేందుకు బహుజన్ సమాజ్ పార్టీ, ఆప్ పార్టీల మాదిరి ఏపీ (వైసీపీ), తెలంగాణ (టీఆర్ 0ఎస్ )ముఖ్యమంత్రులు ఇతర విపక్షాలతో ఎందుకు చేతులు కలపడంలేదని సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి ప్రశ్నించారు. వివాదాస్పద రైతు చట్టాలు, కోవిద్ వంటి పలు అంశాలపై ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన..దీనికి ఈ రాష్ట్రాల సీఎంలు సమాధానాలు చెప్పాలన్నారు. మెడికల్ ఆక్సిజన్ పంపిణీ ‘ ప్రక్షాళన’ పై ప్రభుత్వానికి ఉమ్మడిగా ప్రతిపక్షం ఈ నెల 2 న ఇచ్చిన లేఖపై బహుజన్ సమాజ్ పార్టీ సంతకం చేసిందని, కానీ ఆ తరువాత ఇదే విషయానికి సంబంధించిన రెండు లేఖలపై మాత్రం సంతకం చేయలేదని ఆప్ మాత్రం ఈ ప్రయత్నాలకు దూరంగా ఉందన్న ప్రశ్నకు ఆయన..వీటికి సమాధానాలను ఆయా పార్టీలనే అడగాలని అన్నారు. అలాగే ఒడిశా, ఏపీ, తెలంగాణ సీఎంలు కూడా ఈ ప్రయత్నాల్లో భాగస్వాములు కాలేదన్నారు. ముఖ్యంగా ఈ కోవిద్ సంక్షోభ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రతి పార్టీ కూడా చేతులు కలపాలని తాము కోరుతున్నామని ఆయన చెప్పారు. ఈ పాండమిక్ కారణంగా దేశ ఎకానమీ కూడా డీలా పడిందన్నారు. సామాన్యుల మనుగడకు ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ పథకం, ఉచిత ఆహారం వంటి చర్యలను తీసుకోవాలని సీతారాం ఏచూరి సూచించారు.

అస్సాం విషయానికి వస్తే అక్కడ బీజేపీ, సెక్యులర్ పార్టీల మధ్య పెద్దగా తేడాలేదన్నారు. యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజీపీకి వ్యతికిరేకంగా సెక్యులర్ శక్తులు ఏకం కావాలంటూ ప్రజలు గోడల మీద రాతలు రాశారని ఆయన తెలిపారు. కేరళలో సీఎం పినరయి విజయన్ పార్టీపై పూర్తి పట్టును సాధించారని ఆయన చెప్పారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Mars Rover: అంగారక గ్రహంపై ఉప్పు.. మరో ఆసక్తికర ఫోటో రిలీజ్ చేసిన నాసా రోవర్… ( వీడియో )

Buddhadeb Bhattacharya : కరోనాతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య