Smart Policing: స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీ నెంబ‌ర్ వ‌న్‌.. తెలంగాణ పోలీసులు ఎక్కడున్నారో తెలుసా..

|

Nov 18, 2021 | 8:46 PM

ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు మరో ఘనత దక్కింది. స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీ నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది. దేశంలోనే అత్యుత్తమ పోలీస్‌గా ఎంపికైంది. స్మార్ట్ పోలీసింగ్‌పై దేశ‌వ్యాప్తంగా..

Smart Policing: స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీ నెంబ‌ర్ వ‌న్‌.. తెలంగాణ పోలీసులు ఎక్కడున్నారో తెలుసా..
Ap Police Telangana Police
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు మరో ఘనత దక్కింది. స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీ నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది. దేశంలోనే అత్యుత్తమ పోలీస్‌గా ఎంపికైంది. స్మార్ట్ పోలీసింగ్‌పై దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌లో జరిపిన స‌ర్వే నిర్వహించింది ఇండియ‌న్ పోలీస్ ఫౌండేష‌న్. ఈ ర్యాంకింగ్‌లో ఏపీకి అగ్రస్థానం లభించగా తెలంగాణకు సెకెండ్ ప్లేస్ లభించింది. 2014 డీజీపీల స‌మ్మేళ‌నంలో స్మార్ట్ పోలీసింగ్ ప‌ద్దతుల‌ను పాటించాల‌ని ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పిలుపుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ముందుకు వచ్చాయి.

ప్రధాని పిలుపుకు స్పందించి స్మార్ట్ పోలీసింగ్ నిర్వహిస్తున్న రాష్ట్రాల‌లో ఇండియ‌న్ పోలీస్ ఫౌండేష‌న్ (ఐపీఎఫ్‌) స‌ర్వే చేసింది. ప్రజ‌ల ప‌ట్ల పోలీసులు వ్యవ‌హ‌రిస్తున్న తీరుపై స‌ర్వే నిర్వహించింది ఐపీఎఫ్‌. ఫ్రెండ్లీ పోలీసింగ్‌, నిష్పక్షపాత‌, చ‌ట్టబద్ధ, పార‌ద‌ర్శక పోలీసింగ్‌, జ‌వాబుదారీత‌నం, ప్రజ‌ల న‌మ్మకం విభాగాల్లో ఏపీ నెంబ‌ర్ వ‌న్, రెండో స్థానంలో తెలంగాణ ఉన్నాయి.

పోలీస్ సెన్సిటివిటి, పోలీసుల ప్రవ‌ర్తన‌, అందుబాటులో పోలీసు వ్యవ‌స్థ, పోలీసుల స్పంద‌న, టెక్నాల‌జీ ఉప‌యోగం విభాగాల్లో తెలంగాణ‌కు మొద‌టి స్థానం దక్కించుకుంది. ఏపీకి రెండో స్థానం లభించింది.

ఇవి కూడా చదవండి: CM Jagan: కుప్పం ఎఫెక్ట్‌‌తో అసెంబ్లీకి రాలేదేమో.. చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు..

ఒక్క స్ట్రోక్‌తో కోటీశ్వరులైన మదుపరులు.. గతేడాది రూ. 12 పెట్టుబడి పెడితే ఇప్పుడెంతో తెలుసా?