Anurag Thakur: ప్రియాంక గాంధీ పెయింటింగ్‌కు రూ.2 కోట్లా.. అవినీతిలో రోజుకో కొత్త మోడల్ బయటపడుతోందన్న కేంద్ర మంత్రి

రూ.2కోట్ల పెయింటింగ్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. యస్ బ్యాంక్ కో-ఫౌండర్ రాణా కపూర్‌ను ప్రియాంక వద్ద ఉన్న పెయింటింగ్‌ను రూ.2 కోట్లు పెట్టి కొనాలని..

Anurag Thakur: ప్రియాంక గాంధీ పెయింటింగ్‌కు రూ.2 కోట్లా.. అవినీతిలో రోజుకో కొత్త మోడల్ బయటపడుతోందన్న కేంద్ర మంత్రి
Anurag Thakur Targets Priyanka

Updated on: Mar 14, 2023 | 1:56 PM

ప్రియాంక గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. రూ.2కోట్ల పెయింటింగ్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. యస్ బ్యాంక్ కో-ఫౌండర్ రాణా కపూర్‌ను ప్రియాంక వద్ద ఉన్న పెయింటింగ్‌ను రూ.2 కోట్లు పెట్టి కొనాలని ఎవరు బలవంతం చేశారని అడిగారు. ఇలా ఎన్ని పెయింటింగ్‌లను అమ్మారు..? ఈ డబ్బు తీసుకుని ప్రతిఫలంగా పద్మభూషణ్ అవార్డులు ఇచ్చారా..? ఇలా ఎంత డబ్బు సేకరించారు. ఎన్ని అవార్డులు ఇచ్చారు..? అని సూటి ప్రశ్నలను సంధించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. అంతేకాదు, పెయింటింగ్‌ను విక్రయించాల్సిన అవసరం ఏంటని, దాని నుంచి వచ్చిన 2 కోట్లు ఎక్కడివని అనురాగ్ ఠాకూర్ ప్రియాంక గాంధీని ప్రశ్నించారు. ఈ కొనుగోలు లావాదేవీలో R ఎవరు? పెయింటింగ్ పద్మభూషణ్ అవార్డ్ కోసమా? ఇలాంటి అవార్డులు, పెయింటింగ్‌లు ఇంకా ఎన్ని అమ్మి సొమ్ము చేసుకున్నారు? దేశాన్ని అమ్మే అవకాశాన్ని కాంగ్రెస్‌ వదిలిపెట్టలేదన్నారు.

ప్రపంచవ్యాప్తంగా జరిగే మనీలాండరింగ్, ఉగ్ర నిధులపై నిఘా వహించే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్‌లో ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి పెయింటింగ్‌ను రూ.2కోట్లు పెట్టి ఓ బ్యాంక్ సీఈఓ కొనుగోలు చేశారని, మనీ లాండరింగ్ ద్వారా ఈ లావాదేవీ జరిగిందని రిపోర్ట్ చేసింది. ఈ సమయంలో కేంద్రంలో కాంగ్రెసే అధికారంలో ఉంది.

అయితే పార్టీ పేరును గానీ, పెయింటింగ్ కొనుగోలు చేసిన వ్యక్తి పేరును గానీ రిపోర్టులో ఎక్కడా ప్రస్తావించలేదు. అతని పేరు ‘మిస్టర్ ఏ’ అని మాత్రమే పేర్కొంది. అతను బ్యాంక్ సీఈఓగా ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్న కంపెనీలకు కూడా రూ. వేల కోట్ల రుణాలు ఇచ్చాడని వెల్లడించింది. అయితే ఎస్‌ బ్యాంకు మాజీ సీఈఓ రానా కపూర్ రూ.2 కోట్లు పెట్టి ఎంఎఫ్‌ హుస్సేన్‌ పెయింటింగ్‌ను ప్రియాంక గాంధీ నుంచి బలవంతంగా కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడని ఈడీ ఛార్జిషీట్‌లో తెలిపింది.

ఈ డబ్బును గాంధీ కుటుంబం సోనియా గాంధీకి న్యూయార్క్‌లో చికిత్స కోసం ఉపయోగించిందని ఆయన చెప్పినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌ఏటీఎఫ్‌ నివేదిక అనంతరం అనురాగ్ ఠాగూర్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ కుటుంబం అవినీతిలో రోజుకో కొత్త మోడల్ బయటపడుతోందని.. ఇది సిగ్గుచేటని ధ్వజమెత్తారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. నేషనల్ హెరాల్డ్, వాద్రా ల్యాండ్ స్కామ్, ఇప్పుడు పెయింటింగ్ వ్యవహారం బయటపడిందని విమర్శించారు. గాంధీ కుటుంబం అవినీతి కథను ఓ కేస్ స్టడీగా ప్రపంచానికి తెలియజేశారని ఎద్దేవా చేశారు.

అందులో వెల్లడైంది. తనను బలవంతం చేసిన మంత్రి పేరు కూడా రానా చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. పెయింటింగ్‌ను కొనుగోలు చేయకపోతే గాంధీ కుటుంబంతో సంబంధాలు ఏర్పరచుకోవడంలో సమస్య వస్తుందని అప్పటి పెట్రోలియం మంత్రి మురళీ దేవరా తనతో చెప్పారని ఆయన అన్నారు. దీని తర్వాత, మురళీ దేవరా కుమారుడు మిలింద్ దేవరా, మే 1, 2010న రాణా కపూర్‌కి ఒక లేఖ రాశాడు. ఈ లేఖలో, అతను రాణా కపూర్‌ను మామయ్యగా సంబోధిస్తూ, ఈ పెయింటింగ్‌ను కొనుగోలు చేయడంలో తాను సమర్థుడని హామీ ఇస్తూ రాశాడు.

పెయింటింగ్ కొనమని పదే పదే అడిగేవాడని సమాచారం. గాంధీ కుటుంబానికి సహాయం చేస్తే పద్మభూషణ్ ఇచ్చే అంశాన్ని పరిశీలించవచ్చని అహ్మద్ పటేల్ తనతో చెప్పినట్లు రానా ఈడీకి తెలిపినట్లు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం