Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anurag Thakur: భూపేష్ బఘేల్ తప్పించుకుంటున్నారు.. ఇండియా కూటమిలో సరైన నాయకుడే లేడు: కేంద్ర మంత్రి ఫైర్

అసెంబ్లీ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో మహాదేవ్‌ బెట్టింగ్ యాప్ తీవ్ర కలకలం రేపుతోంది. బెట్టింగ్‌ యాప్‌ స్కాంపై కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటలయుద్దం నడుస్తోంది. తనపై బీజేపీ చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ ఘాటైన కౌంటరిచ్చారు. నవంబర్ 17 వరకు ఎంజాయ్‌ చేయండంటూ బీజేపీ విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఈ బెట్టింగ్‌ యాప్‌ను చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Anurag Thakur: భూపేష్ బఘేల్ తప్పించుకుంటున్నారు.. ఇండియా కూటమిలో సరైన నాయకుడే లేడు: కేంద్ర మంత్రి ఫైర్
Anurag Thakur, Bhupesh Baghel
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 07, 2023 | 12:23 PM

అసెంబ్లీ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో మహాదేవ్‌ బెట్టింగ్ యాప్ తీవ్ర కలకలం రేపుతోంది. బెట్టింగ్‌ యాప్‌ స్కాంపై కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటలయుద్దం నడుస్తోంది. తనపై బీజేపీ చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ ఘాటైన కౌంటరిచ్చారు. నవంబర్ 17 వరకు ఎంజాయ్‌ చేయండంటూ బీజేపీ విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఈ బెట్టింగ్‌ యాప్‌ను చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నవంబర్‌ 17 వరకు ఎంజాయ్ చేయగలదు. కానీ.. ఈ ఆరోపణలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపవంటూ పేర్కొన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే ఇలాంటి ప్రయత్నాలను ఎన్నికల సంఘం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వ్యాఖ్యల అనంతరం.. బీజేపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారంపై భూపేష్ బఘేల్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. భూపేష్ బఘేల్ ప్రశ్నల నుంచి తప్పించుకుంటున్నారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఆయన ప్రజలకు లేదా దర్యాప్తు సంస్థలకు లేదా మీడియాకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.. అంటూ కేంద్ర మంత్రి ఫైర్ అయ్యారు.

అనురాగ్ ఠాకూర్ మాట్లాడిన వీడియో..

అంతేకాకుండా.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇండియా కూటమిపై కూడా విమర్శలు గుప్పించారు. తాను ఇప్పటికే చెప్పినట్లు, భారత కూటమిలో సరైన నాయకుడు లేదా విధానం లేదు.. వారి ఉద్దేశాలలో కూడా లోపం ఉందంటూ పేర్కొన్నారు. ఈ కూటమిలోని చాలా మంది నాయకులు అవినీతికి పాల్పడ్డారని.. తమను తాము రక్షించుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.

కాగా.. దుబాయ్‌లో ఉన్న మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ యజమాని శుభమ్‌ సోని మాట్లాడిన వీడియో వైరల్‌ అయ్యింది. ఆ యాప్‌ను రూపొందించేందుకు భూపేశ్‌ తనను ప్రోత్సాహించారని శుభమ్‌ సోని ఆరోపించాడు. ఇప్పటివరకు ఆయనకు రూ.508 కోట్లు చెల్లించానంటూ పేర్కొన్నాడు. బెట్టింగ్‌ యాప్‌నకు అసలైన ఓనర్‌ సీఎం బఘేల్‌ అని వీడియోలో పేర్కొన్నాడు. భిలాయ్‌లో తన సహచరులు అరెస్టు అయినప్పుడు.. సీఎం తనని యూఏఈకి పారిపోవాలని సలహా ఇచ్చిన్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈడీ చర్యలు ప్రారంభించిందని.. ఈ వ్యవహారం నుంచి తనని బయటపడేయాలంటూ భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. తొలిదశ పోలింగ్‌ ఇవాళ జరుగుతోంది. 17న రెండో దశ పోలింగ్‌ నిర్వహించనున్నారు. డిసెంబర్ మూడున ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ కలకలం రేపుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..