Bangalore Development Authority: కర్ణాటకలోని బెంగళూరులో అక్రమార్కులపై అవినీతి నిరోధక శాఖ కొరడా ఝుళిపించింది. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను ప్రభావితం చేసి.. వారి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న మధ్యవర్తుల ఇళ్లపై ఏసీబీ (ACB) అధికారులు దాడులు నిర్వహించారు. 9 మంది ఏజెంట్ల ఇళ్లలో సోదాలు నిర్వహించి భారీగా నగదు, నగలు, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కొందరు మధ్యవర్తులు, మరికొందరు ఏజెంట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ కార్యకలాపాల్లో భారీగా అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు నగర వ్యాప్తంగా వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న అక్రమార్కుల ఇళ్లపై ఒకేసారి దాడులు నిర్వహించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీసు సూపరింటెండెంట్ ఉమా ప్రశాంత్ ఆధ్వర్యంలో 100 మంది అధికారులు, సిబ్బంది దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ దాడుల్లో ఆర్టీ నగర్‌కు చెందిన మోహన్అనే వ్యాపారవేత్త నుంచి సుమారు 5 కేజీల బంగారం, 15.02 కేజీల వెండి, 61.9 గ్రాముల వజ్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా పలు కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో 8 మందికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
4.960 Kg Gold, 15.02 Kg Silver and 61.9 grams Diamonds (600 cents) recovered from the residence of businessman Mohan in Manorayanapalya, RT Nagar, Bengaluru pic.twitter.com/ZvaO96xPLV
— ANI (@ANI) March 22, 2022
గత వారం 18 మంది అధికారుల ఇళ్లపై దాడులు..
కర్ణాటకలో గతవారం రాష్ట్రవ్యాప్తంగా 18 మంది ప్రభుత్వ అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడులు (మార్చి 16) బుధవారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 75 వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో బాదామి జిల్లా బాగల్‌కోట్‌లోని రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ (ఆర్‌ఎఫ్‌ఓ) ఇంట్లో ఏసీబీ 3 కిలోల చందనం దొరికినట్లు అధికారులు తెలిపారు.
Also Read: