మృతుల కుటుంబాల్ని పరామర్శించిన ప్రియాంక గాంధీ

| Edited By:

Dec 23, 2019 | 5:18 AM

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు పలుచోట్ల హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. యూపీలోని బిజ్నోర్‌లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఇద్దరు పౌరులు మృతిచెందారు. దీంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. ఆదివారం మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ యూపీలో పర్యటించారు. బిజ్నోర్‌ జిల్లాలోని నహ్తౌర్ ప్రాంతాలో ఆందోళనల్లో మరణించిన వారి కుటుంబీకులను.. ప్రియాంక కలుసుకున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. బాధిత కుటుంబాలతో పాటుగా.. స్థానికులతో కూడా మాట్లాడారని.. […]

మృతుల కుటుంబాల్ని పరామర్శించిన ప్రియాంక గాంధీ
Follow us on

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు పలుచోట్ల హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. యూపీలోని బిజ్నోర్‌లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఇద్దరు పౌరులు మృతిచెందారు. దీంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. ఆదివారం మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ యూపీలో పర్యటించారు. బిజ్నోర్‌ జిల్లాలోని నహ్తౌర్ ప్రాంతాలో
ఆందోళనల్లో మరణించిన వారి కుటుంబీకులను.. ప్రియాంక కలుసుకున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. బాధిత కుటుంబాలతో పాటుగా.. స్థానికులతో కూడా మాట్లాడారని.. యూపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ తెలిపారు.

కాగా, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ..బిజ్నోర్‌లో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వుతూ అలజడి సృష్టించారు. అంతేకాదు.. పదుల సంఖ్యలో వాహనాలను తగలబెట్టారు. ఇదిలా ఉంటే.. ఆందోళనలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై కొరడా ఝలిపించేందుకు యూపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎవరైతే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారో.. వారిని సీసీ ఫుటేజీలో గుర్తించి వారి ఆస్తులను సీజ్ చేస్తోంది.