అస్సాంలోని దిబాలాంగ్ స్టేషన్‌లో రైలు పట్టాలు తప్పింది. అగర్తల-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ దిబాలాంగ్ స్టేషన్‌లో పట్టాలు తప్పింది. ఈ రైలు అగర్తలా నుంచి ముంబాయికి వెళ్లాలసి ఉంది. ఈ సంఘటన గురువారం సాయంత్రం 4 గంటలకు లండింగ్-బర్దర్‌పూర్ హిల్ సెక్షన్‌లోని లుమ్‌డింగ్ డివిజన్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరుగలేదని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే లుమ్డింగ్ తెలిపారు. ఈ సందర్భంగా లుమ్‌డింగ్-బదర్‌పూర్ సింగిల్ లైన్ సెక్షన్ మీదుగా రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు వారు తెలిపారు.
సంఘటన జరిగిన తర్వాత పునరుద్ధరణ పనులను సీనియర్ అధికారులు పరిశీలించారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని రైల్వే లుమ్‌డింగ్‌లో హెల్ప్‌లైన్ నంబర్‌లను . హెల్ప్‌లైన్ నంబర్లు 03674 263120 మరియు 03674 263126 జారీ చేసింది. ఇటీవల దేశవ్యాప్తంగా పలుచోట్ల రైలు పట్టాలు తప్పిన ఘటనలు నమోదయ్యాయి. దీంతో నెటిజన్లు రైల్వే శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ప్రమాదాలు జరుతున్నా, ప్రాణాలు పోతున్నా రైల్వే శాఖ పట్టించుకోవడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు.