Covid-19: మావోయిస్టుల శిబిరాల్లో కరోనా కలకలం.. మహమ్మారితో మరో అగ్రనేత వినోద్ మృతి..

| Edited By: Shaik Madar Saheb

Jul 13, 2021 | 6:11 PM

Maoist Commander Vinod Death: కరోనావైరస్ మావోయిస్టుల్లో అలజడి సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో కరోనా బారిన పడి పలువురు కీలక మావో నేతలు

Covid-19: మావోయిస్టుల శిబిరాల్లో కరోనా కలకలం.. మహమ్మారితో మరో అగ్రనేత వినోద్ మృతి..
Corona
Follow us on

Maoist Commander Vinod Death: కరోనావైరస్ మావోయిస్టుల్లో అలజడి సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో కరోనా బారిన పడి పలువురు కీలక మావో నేతలు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మావోయిస్ట్ అగ్రనేత వినోద్ కరోనావైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగడంతో మరణించినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు. వినోద్ దక్షిణ ప్రాంతీయ కమిటీలో కీలకంగా వ్యవహరించారు. పలు కీలక దాడులకు సంబంధించి వినోద్‌పై చాలా కేసులున్నాయన్నారు. అతనిపై పదిహేను లక్షల రివార్డ్ ఉంది. ఎన్ఐఏ నుంచి రూ.5 లక్షలు, ఛత్తీస్‌ఘట్ పోలీసుల నుంచి రూ.10 లక్షల రివార్డు ఉంది. జీరం అంబుష్, ఎమ్మెల్యే బిమా మండవి మృతి వెనకాల వినోద్ మాస్టర్ మైండ్‌గా వ్యవహరించారు. వినోద్ దర్షి ఘాటి ఊచకోతకు సూత్రధారిగా ఉన్నారని అధికారులు తెలిపారు. అప్పటినుంచి ఎన్ఐఏకి మోస్ట్ వాంటెడ్‌గా వినోద్ ఉన్నారు.

కాగా.. కరోనా మావోల శిబిరాల్లో కలకలం రేపుతోంది. ఇటీవల మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ చనిపోయారు. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న ఆయన కరోనాతో అనారోగ్యంతో మరణించారు. దీంతోపాటు పలువురు సభ్యులు కూడా చనిపోయినట్లు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటన మరిచిపోక ముందే మరో అగ్రనేత మరణించడం.. మావోలకు కరోనా సవాలుగా మారింది.

Also Read:

Kaushik Reddy: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రాజకీయం రోజుకో ట్విస్ట్‌.. కౌశిక్‌రెడ్డికి మనిక్కమ్ ఠాగూర్ లీగల్ నోటీస్

Hubble Space Telescope: హబుల్ స్పేస్ టెలిస్కోప్ పనిచేయడం లేదు.. నెలరోజులు దాటినా పరిష్కారం లేక నాసా ఇంజనీర్ల టెన్షన్!