పంజాబ్ అమృత్‌సర్లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో శనివారం రోజున బాంబు పేలిన ఘటన దుమారం రేపింది. అయితే తాజాగా మళ్లీ అదే ప్రాంతానికి సమీపంలో మరో బాంబు పేలడం కలకలం రేపుతోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ బాంబు ఎవరుపెట్టారనే విషయం కూడా ఇంతవరకు తెలియలేదని దీనిపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
సోమవారం ఉదయం 6.30 గంటలకు బాంబు పేలినట్లు అక్కడి స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విచారణ కోసం సాంపుల్స్‌ను సేకరిస్తున్నారు. అయితే మూడు రోజుల్లోనే సిక్కులు పవిత్రంగా భావించే గోల్డెన్ టెంపుల్ వద్ద రెండుసార్లు బాంబులు పేలడంపై స్థానికులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సమంగ్రంగా విచారణ జరిపి నిందితులను శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం