విమానయాన రంగంలోకి మరో భారత బిలియనీర్.. టికెట్ ధరల పోటీతో కస్టమర్లకే లాభం

| Edited By: Phani CH

Jul 28, 2021 | 6:42 PM

భారత విమానయాన రంగంలోకి మరో బిలియనీర్ ప్రవేశించారు. ఆయనే ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝంజువాలా..తక్కువ ధరకే విమాన ప్రయాణం (లో కాస్ట్) చేసేందుకు అనువుగా ఎయిర్ లైన్ ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు..

విమానయాన రంగంలోకి మరో భారత బిలియనీర్.. టికెట్ ధరల పోటీతో కస్టమర్లకే లాభం
Rakesh Jhunjhunwala
Follow us on

భారత విమానయాన రంగంలోకి మరో బిలియనీర్ ప్రవేశించారు. ఆయనే ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝంజువాలా..తక్కువ ధరకే విమాన ప్రయాణం (లో కాస్ట్) చేసేందుకు అనువుగా ఎయిర్ లైన్ ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.. భవిష్యత్తులో దేశ ఏవియేషన్ సెక్టార్ (విమానయాన రంగం) ప్రజలకు తక్కువ రేట్లకే విమానాల్లో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించగలదని తాను ఆశిస్తున్నట్టు ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో 70 విమానాల ఫ్లీట్లతో కొత్త ఎయిర్ లైన్ ని స్టార్ట్ చేసే యోచన తనకు ఉందని 61 ఏళ్ళ ఝంజువాలా వెల్లడించారు. తక్కువ టికెట్ ధరలతో ప్రజలు విమానాల్లో ప్రయాణించాలన్నది తన ఉద్దేశమని, ఈ వెంచర్ కోసం 35 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నానని ఆయన వెల్లడించారు. ఎయిర్ లైన్ లో ఇది 40 శాతం వాటా అని వివరించారు. తన ప్రతిపాదనకు దేశ వైమానిక మంత్రిత్వ శాఖ నుంచి మరో 15 రోజుల్లో నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ లభించగలదని ఆశిస్తున్నానన్నారు.

తమ ఎయిర్ లైన్ ని ‘ఆకాశ ఎయిర్’ అని వ్యవహరిస్తామని, డెల్టా ఎయిర్ లైన్స్ కి చెందిన మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ నేతృత్వంలో టీమ్ ఉంటుందని రాకేష్ ఝంజువాలా తెలిపారు. కనీసం 180 మంది ప్రయాణికులను తీసుకువెళ్లేలా తమ విమానాలు ఉంటాయని ఆయన చెప్పారు. ఇండియాలోని అభినవ ‘వారెన్ బఫెట్’ గా ఈయనను పోలుస్తున్న విషయం తెలిసిందే.. ఈ కరోనా వైరస్ పాండమిక్ సమయంలో మన విమానయాన రంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఈయన చేసే ప్రయత్నం నిజంగా సాహసోపేతమైనదే..

 

మరిన్ని ఇక్కడ చూడండి: Apartment: బిల్డర్ నిర్వాకంతో గాలిలో తేలియాడుతున్న అపార్ట్‌మెంట్.. కంచం, మంచం పట్టుకుని పరుగులు పెడుతున్న జనం!

TS ECET 2021: టీఎస్ ఈసెట్ పరీక్ష తేదీ ఖరారు.. రేపటి నుంచి అందుబాటులో హాల్‌టికెట్లు..