దేవుడికి మొక్కేందుకు వచ్చారు.. తీరా హుండీలో వేసిన కానుక చూడగా అర్చకులు షాక్

Sawariya Seth Temple: అయితే, ఈ ఆలయానికి ఇలాంటి వింత కానుకలు సమర్పించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి విచిత్రాలు చోటుకున్నాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. వెండి పెట్రోల్‌ పంపు, ల్యాప్‌టాప్, విమానం, ఐఫోన్‌, ట్రాక్టర్ వంటి కానుకలు వచ్చాయని అంటున్నారు.

దేవుడికి మొక్కేందుకు వచ్చారు.. తీరా హుండీలో వేసిన కానుక చూడగా అర్చకులు షాక్
Silver Gun To Lord Krihna

Updated on: Jul 26, 2025 | 8:43 PM

Sawariya Seth Temple: రాజస్థాన్ రాష్ట్రం చిత్తోర్‌గఢ్ జిల్లాలోని ప్రసిద్ధ సావరియా సేథ్ ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుడికి అజ్ఞాత భక్తుడు వెండి రివాల్వర్‌ను, బుల్లెట్లను బహూకరించాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భక్తులు దేవుళ్లకు నగలు, వస్త్రాలు, విలువైన వస్తువులు, ధనం సమర్పించడం చూస్తుంటాం. కానీ వెండి రివాల్వర్, బుల్లెట్లు సమర్పించడం చాలా అరుదైన విషయం.

ఆలయ అధికారుల స్పందన..

సావరియా సేథ్ ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక భక్తుడు తన పేరు వెల్లడించడానికి ఇష్టపడకుండా, సుమారు ఒక కిలో బరువున్న వెండి రివాల్వర్‌ను, కొన్ని వెండి బుల్లెట్లతోపాటు రెండు వెల్లుల్లిపాయలను కూడా స్వామివారికి సమర్పించాడు. ఈ బహుమతిని చూసి ఆలయ సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. ఈ బహుమతిని స్వామివారి హుండీలో వేశాడని, ఇలా దేవునికి ఆయుధాన్ని కానుకగా సమర్పించడం తొలిసారని ఆలయ ఛైర్మన్‌ జానకీదాస్‌ అన్నారు.

వెండి రివాల్వర్ వెనుక ఉన్న ఉద్దేశ్యం..

ఈ అసాధారణ బహుమతి వెనుక భక్తుడి ఉద్దేశ్యం ఏమిటనే దానిపై పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు భక్తులు తమ కోరికలు తీరినప్పుడు దేవునికి విభిన్నమైన కానుకలు సమర్పిస్తుంటారు. బహుశా ఈ భక్తుడు కూడా తన ప్రత్యేకమైన కోరిక తీరినందుకు లేదా ఏదైనా ప్రమాదం నుంచి రక్షించినందుకు కృతజ్ఞతగా ఈ కానుకను సమర్పించి ఉండవచ్చు అని భావిస్తున్నారు. అలాగే, రాజస్థాన్‌లో వెల్లుల్లి ధర భారీగా పెరిగింది. ఈక్రమంలో ఎవరైనా రైతు వెల్లుల్లి పంటతో భారీగా లాభాలు ఆర్జించి ఉంటాడని, అందుకే స్వామికి ఇలా వెండి రివాల్వర్, వెల్లులి సమర్పించి ఉండవచ్చని అంటున్నారు.

అయితే, ఈ ఆలయానికి ఇలాంటి వింత కానుకలు సమర్పించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి విచిత్రాలు చోటుకున్నాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. వెండి పెట్రోల్‌ పంపు, ల్యాప్‌టాప్, విమానం, ఐఫోన్‌, ట్రాక్టర్ వంటి కానుకలు వచ్చాయని అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..