Jharkhand: జార్ఖండ్ ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు.. కీలక వ్యాఖ్యలు చేసిన అంజలి సోరేన్

జార్ఖండ్‌లో ఈడీ నోటీసుల వ్యవహారం దుమారం రేపుతుంది. సీఎం సోరేన్‌కి ఈడీ నోటీసులు ఇవ్వడంపై ఆయన సోదరి మండిపడ్డారు. సీఎం హేమంత్‌ సోరేన్‌కు వరుసగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ నోటీసులు పంపడం దుమారం రేపుతుంది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ చట్టం​ కింద ఈడీ సోరేన్‌కు ఇప్పటికే ఆరు సార్లు సమన్లు పంపింది ఈడీ. అయితే ఆరుసార్లు ఆయన ఈడీ ముందు హాజరు కాలేదు. దీంతో ఈడీ తాజాగా ఆయనకు ఏడోసారి సమన్లు పంపింది.

Jharkhand: జార్ఖండ్ ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు.. కీలక వ్యాఖ్యలు చేసిన అంజలి సోరేన్
Cm Hemant Soren

Updated on: Jan 08, 2024 | 9:30 AM

జార్ఖండ్‌లో ఈడీ నోటీసుల వ్యవహారం దుమారం రేపుతుంది. సీఎం సోరేన్‌కి ఈడీ నోటీసులు ఇవ్వడంపై ఆయన సోదరి మండిపడ్డారు. సీఎం హేమంత్‌ సోరేన్‌కు వరుసగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ నోటీసులు పంపడం దుమారం రేపుతుంది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ చట్టం​ కింద ఈడీ సోరేన్‌కు ఇప్పటికే ఆరు సార్లు సమన్లు పంపింది ఈడీ. అయితే ఆరుసార్లు ఆయన ఈడీ ముందు హాజరు కాలేదు. దీంతో ఈడీ తాజాగా ఆయనకు ఏడోసారి సమన్లు పంపింది. అంతేకాదు.. ఇదే మీకు లాస్ట్ చాన్స్.. అటెండ్ కావాల్సిందేనంటూ హెచ్చరించింది. మీ స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలి.. ప్లేస్‌, టైమ్‌ చెప్పండి లేదంటే.. అడ్డంకులు ఎదురవుతాయంటూ నోటీసుల్లో ఈడీ పేర్కొంది.

దీంతో ఈడీ తీరుపై జార్ఖాండ్‌ ప్రభుత్వం సీరియస్ అయింది. మరోవైపు సీఎం సోరేన్‌కు ఈడీ నోటీసులు పంపడంపై ఆయన సోదరి అంజలి సోరేన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు ఎస్టీ అయినందునే కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసి ట్రైబల్స్‌ను ఉద్దరిస్తున్నామన్న కేంద్రం.. అదే ట్రైబల్స్‌ అయిన జార్ఖాండ్‌ సీఎంను వేధిస్తుందని ఆరోపించారు. తన సోదరుడి ప్రభుత్వం ట్రైబల్ ప్రభుత్వమని పేర్కొన్నారు. తన సోదరుడికి చెడ్డపేరు వచ్చేలా బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. జార్ఖండ్‌లో సోరేన్‌ ప్రభుత్వం కొనసాగితే ట్రైబల్‌ ఓట్లు బీజేపీ రావనే దురుద్దేశంతో ఈడీని ప్రయోగిస్తుందని మండిపడ్డారు అంజలి సోరేన్. అటు బెంగాల్, ఇటు జార్ఖండ్ లో ఈడీ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..