AP, Telangana News Live: Rain Alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రెండు రోజులూ కుండపోత వాన!
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం హోదాలో 14 వసారి చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి రికార్డ్ నెలకొల్పారు. 22 ఏళ్ల కిందట ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజునే శ్రీవారు తనకు ప్రాణభిక్ష పెట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు..

తిరుపతి, సెప్టెంబర్ 25: తిరుమల తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. తిరుమల క్షేత్రం బ్రహ్మోత్సవాల శోభతో నిండిపోయింది. ప్రతి యేటా తిరుమలలో జరుగుతున్న ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం అంకురార్పణ కార్యక్రమంతో శ్రీకారం చుట్టింది. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధాన ఘట్టంగా నిలిచే ధ్వజారోహణం బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. బుధవారం నుంచే వాహన సేవలు కూడా ప్రారంభమైనాయి. సాయంత్రం 5.43 నుంచి 6.15 గంటల వరకు మీన లగ్నంలో ధ్వజారోహణం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం హోదాలో 14 వసారి చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి రికార్డ్ నెలకొల్పారు. 22 ఏళ్ల కిందట ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజునే శ్రీవారు తనకు ప్రాణభిక్ష పెట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అది ఊహించని పరిణామమని, ఓ పర్పస్ కోసం భగవంతుడు తనను బతికించినట్లు ఆయన తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో 14 సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం దక్కింది. వేంకటేశ్వరస్వామి నాకు ప్రాణభిక్ష పెట్టిన రోజే ప్రాణదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇక ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కూడా నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు.
మరోవైవు దేదిప్యమానంగా వెలిగిపోతున్న తిరుమల. ఫల, పుష్ప, విద్యుత్ అలంకరణలతో ముస్తాబైన తిరుమలకొండ. ఇక ఈ రోజు (గురువారం) ఉదయం సీఆర్వో సమీపంలో రూ.102 కోట్లతో నిర్మించిన వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయం (పీఏసీ-5)ను, అక్కడే రిమోట్ పద్ధతిలో తితిదే ఏఐ ట్విన్ కమాండ్ సెంటర్, విజన్ బేస్డ్ సార్టింగ్ మిషన్ ప్లాంట్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం వార్తా కథనాల కోసం ఇక్కడ వీక్షించండి.
LIVE NEWS & UPDATES
-
తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రోరైల్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోరైల్ నిర్వహణ నుంచి తప్పుకున్న L&T స్థానంలో ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించింది. మెట్రో విస్తరణలో భాగంగా రాష్ట్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతేకాదు L&T కి సంబంధించిన రూ.13 వేల కోట్ల అప్పును కూడా రాష్ట్ర సర్కార్ టేకోవర్ చేయనుంది. మెట్రోరైల్ నిర్వహణ నుంచి తప్పుకున్న ఎల్ అండ్ టీకి ప్రభుత్వం రూ.2,100 కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదింరింది. సీఎం రేవంత్ రెడ్డి, L&T సీఎండీ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది.
-
అంగన్వాడి కేంద్రాలకు దసరా సెలవులు..!
అంగన్వాడి కేంద్రాలకు దసరా సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. రేపటి నుంచి ఎనిమిది రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 27 నుంచి వచ్చే నెల నాలుగు వరకు అంగన్వాడీలకు దసరా సెలవులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల విజ్ఞప్తి మేరకు దసరా సెలవులు మంజూరు చేయాలని అధికారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క అదేశించారు.
-
-
ప్రతిఏటా డిఎస్సీ, టెట్ నిర్వహణః లోకేష్
ఇకపై ప్రతిఏటా డిఎస్సీ నిర్వహిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. నవంబర్ లో టెట్, వచ్చే ఏడాది మళ్లీ పారదర్శకంగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు. సచివాలయం సమీప ప్రాంగణంలో మెగా డిఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 150రోజుల్లో డిఎస్సీ నిర్వహించడం ఒక చరిత్ర, ఇది నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అని లోకేష్ తెలిపారు. రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో మూడుతరాలు డిఎస్సీ ప్రకటించే అవకాశం వచ్చిందన్నారు. సమిష్టి కృషితో ప్రభుత్వ విద్యావ్యవస్థను దేశానికే దిక్సూచిగా మారుద్దామని మంత్రి పిలుపునిచ్చారు. ఎపి మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం అంతా కలసికట్టుగా కృషిచేద్దామన్న లోకేష్.. విద్యారంగాన్ని రాజకీయాలకు అతీతంగా ఉంచేందుకు వ్యవస్థలో పలు కీలకమైన సంస్కరణలు తెచ్చామన్నారు.
-
ఆర్టీసీ బస్సెక్కితే బహుమతులు..!
దసరా పండుగ నేపథ్యంలో తమ బస్సుల్లో ప్రయాణించేవారికి లక్కీ డ్రా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్ కు ముగ్గురు చొప్పున 33 మందికి రూ.5.50 లక్షల విలువగల బహుమతులను అందజేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఒక్కో రీజియన్ కు ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలను సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 వరకు చేసిన ప్రయాణాలను మాత్రమే లక్కీ డ్రాకి సంస్థ పరిగణనలోకి తీసుకుంటుంది. ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు.
-
ఈడీ ఎదుట హాజరైన నటుడు జగపతిబాబు
టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతిబాబు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకావడం చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. భారీ మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ ఫ్రా కేసులో జగపతిబాబును ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ విచారణలో, జగపతిబాబు గతంలో సాహితీ ఇన్ ఫ్రా సంస్థ యాడ్స్ లో నటించ అంశంపై ఈడీ అధికారులు దృష్టి సారించినట్టు సమాచారం. జగపతిబాబుకు అందిన పారితోషికం, చెల్లింపుల మార్గాలపై వివరాలపై ఆరా తీశారు. ఆ లావాదేవీల గురించి కూపీ లాగినట్లు తెలుస్తోంది.
-
-
భారీ వర్షాలున్నాయి.. అప్రమత్తంగా ఉండండి!
రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ నివేదికపై అన్ని శాఖలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలెర్ట్ గా ఉండి పరిస్థితిని సమీక్షించాలని కోరారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలను తరలించాలని సూచించారు. అన్ని కాజ్‌వేలను పరిశీలించాలని, రోడ్లపైకి వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ ను నిలిపివేయాలన్నారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యా సంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే జనం రోడ్లపైకి రావాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
-
గ్రూప్-1లో ఎస్సీ స్టడీ సర్కిల్ విద్యార్థుల ప్రభంజనం
కోర్టు కేసులు ఎన్నో చిక్కులను అధిగమించి తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈసారి గ్రూప్ వన్ ఫలితాల్లో ఎస్సీ స్టడీ స్టడీ సర్కిల్ విద్యార్థులు 30 ర్యాంకులు సాధించారు. ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు కోచింగ్ తీసుకున్నారు. విద్యార్థులకు అన్ని వసతులు ఇక్కడ కల్పిస్తున్నారు. చదువుకోవడానికి రూములు, 24గంటలు లైబ్రరీ అందుబాటులో ఉండడం విద్యార్థులకు లాభిస్తోంది. ఇక కోచింగ్ విషయానికి వస్తే అనుభవమున్న ఫ్యాక్టల్టీ నేతృత్వంలో బోధన సాగుతుంది. ఢిల్లీ నుంచి సైతం ఫ్యాకల్టీ వస్తుంటారు. తెలుగు మీడియం లో చదువుకున్న పిల్లలు ఇక్కడ ప్రిపేర్ అయ్యారు. 200 పిల్లలు మంది ఎస్సీ స్టడీ సర్కిల్లో ప్రిపేర్ అవుతున్నారు. దాంట్లో 70 మంది అమ్మాయిలు, 130 మంది అబ్బాయిలు ఉన్నారు.ప్రతిరోజు ఎగ్జామ్ కూడా ఉంటుంది. గ్రూప్ 1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్లుగా ముగ్గురు, డీఎస్పీలుగా ఏడుగురు, కమర్షియల్ టాక్స్ అధికారులుగా ఇద్దరు మున్సిపల్ కమిషనర్లుగా ముగ్గురు, ఎంపీడీవోలుగా ఐదుగురు, ఇతర అధికారులుగా మరో 10మంది ఎంపికయ్యారు.
-
మరికాసేపట్లో కుండపోత వాన..!
తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి రాబోయే రెండు రోజుల పాటు హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, తూర్పు తెలంగాణలోని ఆదిలాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
-
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలయ్యకు కోపం వచ్చింది..!
బాలయ్యకు కోపం వచ్చింది. అది కూడా అసెంబ్లీలో.. ఎందుకో తెల్సా..! కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు.. గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో.. సినిమా సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో అవమానించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో జగన్ సినిమా సెలబ్రిటీలను కలిసేందుకు ఇష్టపడలేదని.. సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడమని చెప్పినట్లు గుర్తు చేశారు. అప్పుడు చిరంజీవి కలగజేసుకుని.. గట్టిగా మాట్లాడటంతో జగన్ వచ్చి సినిమావాళ్లను కలిసినట్లు చెప్పారు. ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఆయన గట్టిగా అడిగితే.. ఈయన వచ్చారా..? అంత సీన్ లేదన్నట్లు మాట్లాడారు బాలయ్య. ఇటీవల కూటమి ప్రభుత్వంలో కూడా ఫిల్మ్ డెవలప్‌మెండ్ కార్పోరేషన్ మీటింగ్‌కు ఇండస్ట్రీ వాళ్లను ఆహ్వానించినప్పుడు.. తన పేరును 9 స్థానంలో పెట్టి అవమానించినట్లు బాలయ్య చెప్పారు. ఆ విషయాన్ని వెంటనే సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్‌కు చేసి వివరించినట్లు వెల్లడించారు.
-
తిరుమలలో భక్తులకు నూతన వసతి సముదాయం
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన వసతి సముదాయాన్ని ప్రారంభించారు. పీఏసీ 5ను రూ.102 కోట్ల వ్యయంతో టీటీడీ నిర్మించింది. ఎలాంటి ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చిన భక్తులకు వసతి కల్పించేందుకు గానూ నూతన వసతి సముదాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ భవనం ద్వారా ఒకేసారి 4 వేల మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేలా నిర్మించారు.
-
శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
బ్రహ్మాండ నాయకుడి బ్రహోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. గురువారం (సెప్టెంబర్ 25) భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇరువురికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తుల వసతిసౌకర్యం కోసం నూతనంగా నిర్మించిన పిలిగ్రిమ్స్ అమ్నెటీస్ కాంప్లెక్స్-5ను ప్రారంభించారు ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, ఆనం, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
-
97 తేజస్ ఫైటర్ జెట్లకు రూ.66 వేల కోట్లతో డీల్..!
భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కు 97 తేజస్ మార్క్-1A ఫైటర్ జెట్ల కోసం హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(HAL)తో కీలక ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ డీల్ విలువ రూ.66,500 కోట్లు. 2021లో రూ. 46,898 కోట్లతో IAF 83 జెట్లను కొనుగోలు చేసింది. తాజా డీల్ దాని కంటే పెద్దది. కాగా 36 పాత మిగ్-21 జెట్లకు IAF వీడ్కోలు పలకనుంది.
-
టికెట్ ధరల పెంపుపై OG సినిమా యూనిట్‌కు ఊరట
టికెట్ ధరల పెంపుపై OG సినిమా యూనిట్‌కు ఊరట దక్కింది. హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పును రేపటి వరకు సస్పెండ్ చేసింది డివిజన్ బెంచ్. టికెట్ ధరల పెంపుపై నిన్న స్టే విధించారు సింగిల్ జడ్జ్. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన టికెట్ రెట్ల పెంపు ఉత్తర్వులను రద్దు చేశారు. అయితే విచారణలో తమ వాదన వినలేదంటూ అప్పీల్‌కు వెళ్లింది మూవీ యూనిట్. దీంతో మరోసారి సినిమా యూనిట్ అభ్యర్థనను పరిశీలించాలంటూ సింగిల్ జడ్జ్‌కు సూచించింది డివిజన్ బెంచ్. రేపటి వరకు మెమోలో ఇచ్చిన రెట్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది హైకోర్టు డివిజన్ బెంచ్.
-
షారూఖ్ ఫ్యామిలీపై మాజీ NCB అధికారి పరువునష్టం దావా
షారూఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ డైరెక్ట్ చేసిన బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్‌సిరీస్‌పై వివాదం రాజుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ఈ వెబ్‌సిరీస్‌లో తనను తప్పుగా చిత్రీకరించారని ఆరోపిస్తూ.. మాజీ NCB అధికారి సమీర్ వాంఖడే ఢిల్లీ హకోర్టులో 2 కోట్ల రూపాయల పరువునష్టం దావా వేశారు. షారూఖ్‌ఖాన్‌తోపాటు ఆర్యన్‌ఖాన్, గౌరీఖాన్‌లపై కేసు పెట్టారు. రెడ్ చిల్లీస్ నిర్మాణ సంస్థపై కూడా కేసు పెట్టారు. నెట్‌ఫ్లిక్స్ సంస్థపై కూడా సమీర్ వాంఖడే పరువునష్టం దావా వేశారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ఖాన్‌ను సమీర్ వాంఖడే నేతృత్వం లోని ఎన్సీబీ అధికారుల బృందం అరెస్ట్ చేసింది. బాంబే హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆర్యన్‌ఖాన్‌ను విడుదల చేశారు.
-
కాళేశ్వరంపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభం
కాళేశ్వరంపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. NDSA రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదికలపై విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత FIR నమోదు చేయనుంది సీబీఐ. ప్రాజెక్ట్‌లో అవకతవకలు, నిధుల దుర్వినియోగంతో పాటు అవినీతి ఆరోపణలపైనా దర్యాప్తు చేపడుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరంపై సుదీర్ఘంగా చర్చించారు. చివరికి CBI విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులో.. భారీగా అక్రమాలు జరిగాయని PC ఘోష్ కమిషన్ తేల్చిందన్నారు అధికార పార్టీ నేతలు. కేసీఆర్‌తో పాటు హరీష్‌రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. CBI విచారణ నిలుపుదల చేయాలంటూ KCR, హరీష్‌రావు హైకోర్టుకు వెళ్లారు. అయితే తాము PC ఘోష్ నివేదిక ఆధారంగా కాకుండా NSDA రిపోర్టు సహా వివిధ ఫిర్యాదుల ఆధారంగా విచారణను CBIకి అప్పగించామని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. ఆ తర్వాత CBI విచారణ కోసం ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తు మొదలుపెట్టింది CBI. త్వరలోనే FIR కూడా నమోదు చేయబోతోంది.
-
తల్లిదండ్రులను పోషించకపోతే పిల్లలకు ఆస్తి దక్కదు.. సుప్రీం సంచలన తీర్పు
కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లేదంటూ 80 ఏళ్ల వృద్ధ జంట తాజాగా సుప్రీంకోర్టు తలుపుతట్టారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం 2007 ప్రకారం.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వారి ఆస్తులను వినియోగించుకునే హక్కు పిల్లలకు ఉండదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో వృద్ధ జంట ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని వారి కుమారుడిని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
-
కీసర కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. ఆస్తి కోసం బరి తెగించిన తల్లిదండ్రులు
కీసర కిడ్నాప్ కేసులో తాజా అప్‌డేట్. ప్రేమ వివాహం చేసుకున్న తన కూతురు శ్వేతకు ఎక్కడ తమ ఆస్తి ఇవ్వాల్సి వస్తుందో అని కక్ష పెంచుకున్న తల్లిదండ్రులు. ప్రవీణ్‌కు ఆస్తి లేకపోవడమే ప్రధాన కారణం. ఒకే గ్రామానికి చెందిన ఇరు కుటుంబాలు పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి, చివరకు ఆస్తి వద్దని కూతురుతో రాయించుకున్న తల్లిదండ్రులు బాల్ నర్సింహ – మహేశ్వరీలు.
-
‘OG’ మువీ చూసేందుకొచ్చి థియేటర్‌లో అభిమానుల అత్యుత్సాహం.. షో రద్దు
పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మువీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే బుధవారం జరిగిన ఈ సినిమా ప్రీమియర్‌లో ఉహించని ఘటన చోటు చేసుకుంది. ఈ సినిమా ప్రీమియర్ చూసేందుకు వచ్చిన అభిమానులు అత్యుత్సాహంతో థియేటర్‌లో వీరంగం సృష్టించారు. కత్తితో స్క్రీన్‌ను చింపి ధ్వంసం చేశారు. బెంగళూరులోని కే.ఆర్. పురంలోని థియేటర్‌లో ఈ సంఘటన జరిగింది.
-
ములుగు జిల్లాల్లో కుండపోత.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
ములుగు జిల్లాలో గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొడుతున్నది. పలు మండలాల్లో ఆగకుండా వాన కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
-
ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్‌గౌడ్ కన్నుమూత
ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్‌గౌడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంపెల్లి వెంకట్‌గౌడ్.. ‘వొడువని ముచ్చట’, ‘నీళ్ల ముచ్చట’, ‘సర్వాయి పాపన్న చరిత్ర’ వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పుస్తకాలను రాశారు. ఆయన మృతిపట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం. ల్యాండింగ్ సమయంలో విమానానికి పక్షి తగిలినట్లు అనుమానించిన పైలెట్. వెంటనే ఏటీసీ టవర్‌కి సమాచారం అందించిన పైలట్. ఇండిగో విమానానికి పక్షి తగలలేదని ఏటీసీ టవర్ అధికారులు నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలోని 162 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు ఇండిగో వెల్లడించింది.
-
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన హీరో నాగార్జున.. ఏం జరిగిందంటే?
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన టాలీవుడ్ నటుడు నాగార్జున. కొందరు తన వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని, వారిని అడ్డుకోవాలని ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. తన అనుమతి లేకుండా తన ఫోటో, పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
-
లడ్డాఖ్‌లో మొబైల్ ఇంటర్నెట్ బంద్.. గల్లీల్లో పోలీస్ సహారా
నిన్నటి హింసాకాండ తర్వాత లడ్డాఖ్‌లోని లేహ్, కార్గిల్ పట్టణాల్లో పోలీసుల నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ప్రజలు ఎక్కడా గుమికూడకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయగా, మరికొన్ని ప్రాంతాలలో అప్‌లోడ్, డౌన్‌లోడ్ వేగాన్ని పరిమితం చేస్తూ చర్యలు చేపట్టారు. ఈరోజు ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి నిరనస ప్రదర్శనలు లేవు. పోలీసులు, భద్రతా బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కార్గిల్ పట్టణంలో నిషేధాజ్ఞల గురించి మైక్ లో వివరిస్తూ పోలీస్ పెట్రోలింగ్ వాహనం తిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
-
మరికాసేపట్లో DSC అభ్యర్ధులకు నియామక పత్రాల అందజేత.. ఏర్పాట్లు చూశారా?
అమరావతిలో ఈ మధ్యాహ్నం DSC విజేతలకు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం చంద్రబాబు, dcm పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. సచివాలయం వెనుక ప్రాంగణంలో పండుగ వాతావరణంలో విస్తృత ఏర్పాట్లు. సబ్జెక్టుల వారీగా రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలచిన 16 మంది, ఆరుగురు ఇన్ స్పైర్ విజేతలకు కలసి 22మందికి నియామక పత్రాలు అందచేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. మిగిలిన వారికి ప్రాంగణంలోనే అధికారులు నియమాక పత్రాలు ఇచ్చేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాంగణంలో అభ్యర్థులు, వారితోపాటు వచ్చే కుటుంబసభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల కోసం మొత్తం 34వేల సీటింగ్ ఏర్పాట్లు చేశారు.
- ప్రాంతాల వారీగా ప్రాంగణంలో నాలుగుజోన్ల ఏర్పాటు
- జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సబ్ జోన్లు ఏర్పాటు
- నాన్ లోకల్ అభ్యర్థుల కోసం ప్రత్యేక గ్యాలరీల ఏర్పాటు
- ప్రత్యేక బస్ లలో రాత్రికే గుంటూరు చేరుకున్న దూర ప్రాంత అభ్యర్థులు
- అమరావతి రాజధాని నిర్మాణాలను చూస్తూ ఈ మధ్యాహ్నానికి అందరూ ప్రాంగణానికి చేరుకునే ఏర్పాట్లు
- నియామక పత్రాలు పొందిన వారంతా ఇంటికి చేరేంత వరకు ఏర్పా
-
వామ్మో.. కొండ రాళ్లతో వెళుతున్న లారీ రోడ్డుపై బోల్తా!
విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై పామర్రు జాలయ్య మిల్లు వద్ద కొండ రాళ్లతో వెళుతున్న లారీ బోల్తా. తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం. ఆ సమయం లో వెనుక వస్తున్న కార్ కి తగిలిన కొండ రాళ్ళు. కారులో ఉన్న వారు సేఫ్. అదే సమయంలో ఎక్కువ వాహనాలు రాకపోవడంతో తప్పిన ఘోర ప్రమాదం. విజయవాడ వైపు నుంచి మచిలీపట్నం పోర్టుకు వెళుతుండగా లారీ ప్రమాదం. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కొండ రాళ్ళను డోజర్ తో పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసిన ఎస్సై రాజేంద్రప్రసాద్, పోలీసులు. బోల్తా పడిన లారీని క్రేన్ సాయంతో రోడ్డుపై నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.
-
పుణె వర్సిటీ నుంచి రూ.2.46 కోట్లు కాజేసిన తెలంగాణ ఇంజనీర్
ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌నంటూ పుణె యూనివర్సిటీని బురిడీ కొట్టించిన తెలంగాణకు చెందిన సీతయ్య అనే ఇంజనీర్.. ప్రాజెక్టుల పేరుతో రూ.2.46 కోట్లు మోసం చేశాడు. నిందితుడు సీతయ్యను అరెస్టు చేసినట్లు పుణె పోలీసుల వెల్లడించారు.
-
దుమ్ములేపుతున్న ‘ఓజీ’ గ్యాంగ్ స్టర్ మువీ
పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మువీ ‘ఓజీ’ ఓవర్సీస్‌లో దూసుకుపోతుంది. ప్రీమియర్స్‌లోనే ఏకంగా 3 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది.

-
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యుల్ విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 17 తేదీ నుంచి జులై 15 వరకు ఈ పరీక్షలు నిర్వహించినున్నట్లు సీబీఎస్‌ఈ పేర్కొంది. పరీక్షల పూర్తి షెడ్యుల్‌ను సీబీఎస్సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
-
2026 జనవరి నుంచి ATM ద్వారా పీఎఫ్ విత్‌డ్రా..!
వచ్చే ఏడాది (2026) జనవరి నుంచి ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్‌డ్రాయల్ సౌకర్యాన్ని కల్పించే అవకాశం ఉంది. అక్టోబర్ రెండవ వారంలో జరిగే బోర్డు సమావేశంలో ఈ మేరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (పసీబీటీ) నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
-
నేడో.. రేపో.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ సెప్టెంబర్ 26 లేదా 27న జారీ అయ్యే అవకాశం ఉంది. దసరా తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేపే అవకాశం ఉన్నట్లు సమాచారం. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ మేరకు రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం జీవో జారీ చేసి, దాని ప్రకారంగానే షెడ్యూల్ ఒకే సమయంలో వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది.
-
తిరుపతిలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన
తిరుమల తిరుపతిలో సీఎం రెండో రోజు పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తో కలిసి శ్రీవారి దర్శనం. ఉదయం 9.10 గంటలకు పిఎసి-5 వెంకటాద్రి నిలయంను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. రూ. 102 కోట్ల తో భక్తుల వసతి సముదాయాన్ని నిర్మించిన టీటీడీ. ఉప రాష్ట్రపతి తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. ఉదయం 9.55 గంటలకు టీటీడీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించనున్న సీఎం. అనంతరం తిరుమల నుంచి తిరుపతి చేరుకొని అమరావతికి తిరుగు ప్రయాణం.
-
ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కుల్‌దీప్ నయా రికార్డు
రెండు ఫార్మాట్లలో జరిగిన ఆసియా కప్‌లో మొత్తం 31 వికెట్లతో కుల్‌దీప్ యాదవ్ అగ్రస్థానంలో నిలిచారు. దీంతో ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కుల్‌దీప్ నిలిచారు.
-
వెనెజువెలాలో భారీ భూకంపం
వెనెజువెలాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. భయంతో ఇళ్ల నుంచి జనాలు బయటకు పరుగులు తీశారు.
-
‘జైలర్ 2’ రిలీజ్ తేదీ వెల్లడి.. ఇంతకీ ఎప్పుడంటే?
‘జైలర్ 2’ రిలీజ్ తేదీని సూపర్‌స్టార్ రజనీకాంత్ వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈవిషయాన్ని వెల్లడించారు. నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన ‘జైలర్’ (2023) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సీక్వెల్‌గా వస్తున్న జైలర్ 2 జూన్ 12న విడుదలకానున్నట్లు రజనీకాంత్ వెల్లడించారు.
-
స్టార్ హీరో ఇల్లు వేలం.. రోడ్డుపైకి భార్య, పిల్లలు
స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి) ఇల్లు వేలం వేశారు. ఆయన కారు, ఇల్లును వేలం వేసేందుకు బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి ఈఎంఐలు ఆయన సకాలంలో చెల్లించకపోవడంతో ఇల్లు, ఆఫీస్‌కు నోటీసులు అంటించారు. కాగా భార్య ఆర్తితో జయం రవి విడాకుల కేసు కోర్టులో ఉండగానే ఇల్లు వేలానికి రావడం ఆసక్తిగా మారింది. రవి గాయని కెనీషాతో రిలేషన్‌లో ఉన్నట్లు సమాచారం.
Actor Ravi Mohan
-
ఆగని మిస్టరీ డెత్‌లు.. 40కి చేరిన మరణాలు
తూర్పు గోదావరి పెద్దేవంలో ఆగని పశువుల మరణాలు. తాజాగా మరో రెండు గేదెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన తోట నాగేశ్వర రావుకు చెందిన గేదెలు మృతి. దీనితో 40కి చేరిన గేదెల మరణాలు. పశువుల మరణాలపై రైతుల్లో ఆందోళన. తమను ఆదుకోవాలని కోరుతున్న పశువుల యజమానులు.
-
పట్టపగలు నడిరోడ్డుపై.. తుపాకీతో బెదిరించి రూ.కోటి విలువైనా బంగారాభరణాలు చోరీ
దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత భద్రమైన భారత్ మండపం సమీపంలో పట్టపగలు షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బంగారు ఆభరణాలను బండిపై తీసుకెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు తుపాకీతో బెదిరించి రూ. కోటి విలువైన ఆభరణాలతో పరారయ్యారు.
-
బాసరలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు కుష్మాండ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న జ్ఞాన సరస్వతి అమ్మవారు. అమ్మవారికి అల్లం వడలు, గారెలు నైవేద్యంగా సమర్పించిన ఆలయ అర్చకులు. ఈరోజు అమ్మవారికి చతుషష్టి ఉపాచార పూజలు, నిత్య పూజలు జరుపనున్న అర్చకులు, వేద పండితులు.
-
పిల్లలు చేసిన అద్భుతం.. గడ్డి, గోవు మూత్రం, పేడతో దుర్గామాత విగ్రహం
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ హితంగా విగ్రహాన్ని తయారు చేసి అక్క, తమ్ముడు ఆదర్శంగా నిలిచారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్పూర్ కాళికా మాత ఆలయ నిర్వాహకుడు కావేరి సత్యనారాయణ కుమార్తె గాయత్రి (బీఫార్మసీ విద్యార్థిని), కుమారుడు జ్ఞానేశ్వర్ (ఇంటర్ విద్యార్థి) పర్యావరణ రహిత దుర్గామాత విగ్రహాన్ని తయారు చేశారు.
“నాన్నా.. మాకు సెలవులు వచ్చాయి. మేమే పర్యావరణహిత విగ్రహం తయారు చేస్తాం” అని చెప్పిన అక్కాతమ్ముడు. ఆ మాటను నిలబెట్టి వారం రోజుల్లో విగ్రహాన్ని సిద్ధం చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పాలకం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని గ్రహించిన ఈ అక్క తమ్ముళ్లు.. గోవు మూత్రం, పేడ, పాలు, పుట్ట, చెరువుమట్టి, ఎండు గడ్డి, వాటర్ కలర్లతో తయారు చేశారు. కర్రలపై ఎండు గడ్డిని దుర్గామాత రూపంలో చుట్టి, మట్టిలో పంచితం, పాలు, పేడ కలిపిన మిశ్రమంతో అచ్చుపోశారు. ఆవుపేడ వాడటం వల్ల ఎలాంటి పగుళ్లు రాలేదని తెలిపారు. వాటర్ కలర్లతో అందంగా అలంకరించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. తొమ్మిది రోజులపాటు దుర్గామాత పూజలు చేసి విగ్రహాన్ని మామిడి చెట్ల వద్ద నిమజ్జనం చేస్తామని, దీంతో చెట్లకు పోషకాలు పెరుగుతాయని పేర్కొన్నారు. పిల్లలు చేసిన ఈ సృజనాత్మక ప్రయత్నం పర్యావరణహిత ఆచరణకు ప్రేరణగా నిలుస్తోంది.
-
శ్రీశైలం దసరా మహోత్సవాలు 4వ రోజు: నేడు పురవీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం
నంద్యాల జిల్లా శ్రీశైలంలో నాలుగోవరోజు చేరుకున్న దసరా మహోత్సవాలు. సాయంత్రం కుష్మాండదుర్గ అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం. కైలాసవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలఅందుకోనున్న ఆది దంపతులు. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం.
-
బతుకమ్మ సంబురాల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
బుధవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో పంచాయితీ శాఖ ఆధ్వర్యంలో నాల్గవరోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బతుకమ్మలకు పూజలు చేశారు. పంచాయతీ అధికారులు, ఉద్యోగులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలు పాడారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిరోజు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. అంతకుముందు పలువురు మహిళా ఉద్యోగులు వేసిన రంగవల్లులను కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయ మహిళా ఉద్యోగులు, సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ బతుకమ్మ వేడుకల్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, జెడ్పీ సీఈవో గోవింద్, డిపిఓ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-
నేడు బంగాళాఖాతంలో అల్ప పీడనం.. వచ్చే 4 రోజులు వానలే వానలు!
నేడు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్ప పిడనం. దీని ప్రభావంతో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో భారీ వర్షాలు. రేపు ఏలూరు, వెస్ట్ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు. కోస్తా మిగిలిన జిల్లాలు, పల్నాడు వైయస్సార్ కడప, కర్నూలు నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు. మరోవైపు ఈ నెల 28, 29 తేదీల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు.. వేటకు వెళ్లిన మత్స్యకారులు ఒడ్డుకు చేరుకోవాలని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
-
AP Rains: వచ్చే 2 రోజులు ఏపీకి అతి భారీ వర్షాలు
ఆరు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన. ఈ నెల 26, 27 తేదీల్లో కోస్తాలో చాలా చోట్ల భారీ నుంచి అతిభారి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్ప పిడనం. అల్పాపీడనం రేపటికి వాయుగుండంగా మారే అవకాశం. పశ్చిమ దిశగా ప్రయాణించనున్న వాయుగుండం. ఈనెల 27 నాటికి దక్షిణ ఒడిస్సా, ఉత్తర కోస్తా తీరం తాకనున్న వాయుగుండం. ఈరోజు కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, శ్రీకాకుళం, పారావతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, ఏలూరు, వెస్ట్ గోదావరి, పల్నాడు, ఏన్టీ ఆర్ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ అవకాశం ఉంది.
-
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పట్టనుంది. 7 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 58,628 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ 3.01 కోట్లు.
-
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు వాహన సేవలు
తిరుమల తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు వాహన సేవలు. ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం. రాత్రి 7 గంటలకు హంస వాహనం.
-
Telangana Rains: నేడు, రేపు భారీ వర్షాలు
రేపు తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ , మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలెర్ట్ జారీ. ఈరోజు, రేపు తెలంగాణ లోని అన్ని జిల్లాలలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
-
నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఉత్తర ఒడిస్సా గ్యాంగ్ టెక్ వెస్ట్ బెంగాల్ తీరాల సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడే అవకాశం. సగటు సముద్రమట్టం నుండి 7.6 కి మీ ఎత్తువరకు కొనసాగుతూ ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకు వాలి ఉన్న ఉపరితల ఆవర్తనం. ఈ రోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం. ఈ అల్పపీడనం పశ్చిమ దిక్కులో కదులుతూ బలపడి వాయువ్యం దానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపు వాయుగుండంగా మారే అవకాశం. ఈ వాయుగుండం దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో ఎల్లుండి తీరాన్ని దాటే అవకాశం.
ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో తేలికపాటి ఉరుములతో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాకు ఎల్లో అలెర్ట్ జారీ.
-
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ జైలు నుంచి పరార్..
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం హైదరాబాద్ లో గాలిస్తున్న ఏపీ పోలీసులు. పోలీస్ ఎస్కార్ట్ నుండి తప్పించుకొని హైదరాబాద్ వచ్చినట్టు పోలీసుల అనుమానం. బేడీలు ఉండగానే పోలీసుల నుండి తప్పించుకున్న ప్రభాకర్. హైదరాబాద్ లోను బత్తుల ప్రభాకర్ పై పలు కేసులు ఉండటంతో పోలీస్ అలెర్ట్. బత్తుల ప్రభాకర్ స్నేహితుల వివరాలు ఆరా తీస్తున్న పోలీసులు.
-
తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో టాప్ ర్యాంకర్స్ లిస్ట్
తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో లక్ష్మీదీపికకు మొదటి ర్యాంక్, 2వ ర్యాంక్ వెంకటరమణ, మూడోర్యాంక్ వంశీకృష్ణారెడ్డి సాధించారు. టాప్-10 ర్యాంకర్లకు డిప్యూటీ కలెక్టర్లుగా అవకాశం దక్కనుంది.
-
ఇంద్రకీలాద్రిపై కాత్యాయని అలంకారంలో దుర్గమ్మ.. పదేళ్ల తర్వాత తొలిసారి దర్శనం
ఇంద్రకీలాద్రిలో 4 వ రోజుకు చేరిన దసరా శరన్నవరాత్రులు. మీరు కాత్యాని దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం. పదేళ్ల తర్వాత మొదటిసారి మళ్లీ ఇంద్రకీలాద్రిపై కాత్యాయని అలంకారం. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన దర్శనాలు.
-
తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 563 పోస్టులకుగాను 562 అభ్యర్థుల ఫలితాలను విడుదల చేసిన TGPSC. కోర్టు కేసు కారణంగా ఒక్క పోస్టు ఫలితం పెండింగ్ పెట్టిన TGPSC.
Published On - Sep 25,2025 6:45 AM
