Anand Mahindra: మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఆనంద్ మహీంద్రా.. పేద కుటుంబానికి చేయూత..

|

Oct 01, 2021 | 8:41 PM

ఆనంద్ మహీంద్రా మరోసారి గొప్పమనసు చాటుకున్నారు. ఓ వ్యక్తి సాయం చేయాలని కొద్ది రోజుల కింద కోరాడు. ఇప్పుడు అందుకు సంబంధించి వివరాలు తెలిపారు...

Anand Mahindra: మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఆనంద్ మహీంద్రా.. పేద కుటుంబానికి చేయూత..
Anand
Follow us on

ఆనంద్ మహీంద్రా మరోసారి గొప్పమనసు చాటుకున్నారు. ఓ వ్యక్తి సాయం చేయాలని కొద్ది రోజుల కింద కోరాడు. ఇప్పుడు అందుకు సంబంధించి వివరాలు తెలిపారు. మణిపూర్‌కు చెందిన ఓ వ్యక్తి స్క్రాప్ నుంచి ఐరన్ మ్యాన్ సూట్‌ తయారు చేశారు. ఇతన్ని ఆదుకోవాలని కోరుతూ కొన్ని రోజుల క్రితం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. తాజాగా ఆయన ట్విట్టర్‌లో తన అభిమానులు, అనుచరులతో ఐరన్ మ్యాన్ సూట్‌ తయారు చేసిన వ్యక్తి వివరాలు వెల్లడించారు. ఆ యువకుడు మణిపూర్‌లోని హీరోక్‌కు చెందినవాడిగా చెప్పారు. అతని పేరు ప్రేమ్ నింగోంబమ్‌గా గుర్తించామన్నారు. యువకుడి ఐరన్ మ్యాన్ సూట్‌ తయారు ఆకట్టుకున్నాడని అన్నారు.

 

“పాత ఇనుప సామాను ఉపయోగించి “ఐరన్ మ్యాన్” సూట్‌ను రూపొందించిన ఇంఫాల్‌కు చెందిన యువకుడు ప్రేమ్ గురించి నేను ట్వీట్ చేశాను. నేను ప్రతిభకు మద్దతు ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నాను. ప్రేమ్, అతని కుటుంబాన్ని ఆదుకున్న ఇంఫాల్‌లోని మా ఆటో రంగ భాగస్వాములైన శివ్జ్ ఆటోటెక్‌కి కృతజ్ఞతలు ” అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రేమ్, అతని కుటుంబానికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. ప్రేమ్ యొక్క నైపుణ్యాల ఆశ్చర్యపోతున్నానని రాసుకొచ్చారు.

 

ప్రేమ్ తయారు చేసిన ఐరన్ మ్యాన్ సూట్ యొక్క కొన్ని డిజైన్ల చిత్రాలను అతను కాగితంపై పంచుకున్నాడని చెప్పారు. మహీంద్రా ఫౌండేషన్ యువకుడికి, అతని తోబుట్టువులకు ఉచిత విద్యను అందిస్తుందని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 20న ఆనంద్ మహీంద్రా ఈ ట్వీట్‌ చేశారు.

 

Read Also.. HanuMan: మారేడుమిల్లి అడవుల్లో చక్కర్లు కొడుతున్న హ‌ను-మాన్‌.. శరవేగంగా షూటింగ్ జరుపుంటున్న తేజ సజ్జ-ప్రశాంత్ వర్మ సినిమా..