Plastic Ban: ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కోసం ఎనిమిది సంవత్సరాల బాలిక వినూత్న ప్రయత్నం చేసింది. ప్లాస్టిక్ వాడకం ఎంత ప్రమాదకరమో ప్రజలకు తెలియజేసేందుకు ఎవరూ చేయని సాహసం చేసింది. ఏకంగా సముద్ర గర్భంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థ్యాలను తొలగించింది. వివరాల్లోకెళితే.. పాండిచ్చేరి ప్రాంతానికి చెందిన తారగై ఆరాధన(8).. తన తండ్రి సహకారంతో స్కూబింగ్ నేర్చుకుంది. అయితే తాను నేర్చుకున్న విద్యతో వినూత్న ప్రయత్నం చేయాలని చిన్నారి ఆరాధన నిర్ణయించుకుంది. ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చెన్నై, పాండిచ్చేరిలో ఉన్న సముద్రంలో అడుగున ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని డిసైడ్ అయ్యింది.
ఈ విషయాన్ని ఆరాధన తన తండ్రికి చెప్పింది. అతను కూడా తన బిడ్డ నిర్ణయాన్ని స్వాగతించాడు. చిన్నారికి అండగా నిలిచాడు. ఈ క్రమంలో బీచ్‌లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు.. సముద్రం లోపల ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఆరాధన తొలగిస్తూ వచ్చింది. చిన్నారి ఆరాధన చేసిన ఈ ప్రయత్నాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ప్లాస్టిక్ నిషేధంపై ఆరాధన చేస్తున్న ప్రయత్నానికి యావత్ సోషల్ మీడియా సలాం కొడుతోంది. నెటిజన్లు ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also read:
Tamil Nadu Lockdown: కరోనా ఎఫెక్ట్.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. లాక్‌డౌన్ పొడిగింపు..
China: చైనా నక్కచిత్తులు..ఆర్మీలో ఇంటికి ఉద్యోగం పేరిట టిబెటన్లకు గాలం..