
విచిత్రమైన కేసులో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ చిక్కుకున్నారు. ఒక డిజైనర్‌పై బెదిరింపులు, కుట్ర ఆరోపణలతో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమృతా ఫడ్నవీస్.. ముంబైకి చెందిన ఓ లేడీ డిజైనర్‌పై కేసు పెట్టారు. అనిక్‌షా అనే మహిళతో పాటు ఆమె తండ్రిపై ఎఫ్ఐఆర్‌లో ఫిర్యాదు చేశారు. డిజైనర్ అనిక్‌షా తనను బెదిరిస్తున్నట్లు, తనకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు అమృత తన ఎఫ్ఐఆర్‌లో ఆరోపించారు.
డిజైనర్ అనిక్‌షా తండ్రి ఓ క్రిమినల్ కేసులో ఇరుక్కున్నారు. ఆయన్ను కాపాడేందుకు సహయపడాలంటూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతను ఆశ్రయించింది అనిక్ షా. ఇందుకు కోసం కోటి రూపాయాలు ఇచ్చేందుకు ఆశజూపిందంటూ అమృతా ఫడ్నవీస్ ఆరోపించారు. ఫిబ్రవరి 18,19 తేదీల్లో డిజైనర్ అనిక్‌షా తనకు వీడియో క్లిప్‌లను, వాయిస్ నోట్స్, మెసేజ్‌లను పంపినట్లు అమృత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అమృత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు డిజైనర్ అనిక్ షాపై కేసు నమోదు చేశారు.
2021 నవంబర్‌లో అమృతను తొలిసారి ఆ మహిళ కలిశారు. బట్టలు, జువెల్లరీ, పూట్ వేర్ డిజైనర్ అంటూ దగ్గరైంది. అయితే తాను రూపొందిచిన దుస్తులు, జువెల్లరీని పబ్లిక్ ఈవెంట్స్ సమయంలో వేసుకోవాలని కోరినట్లు అమృత చెప్పారు. ప్రమోషన్ కోసం ఆ పనిచేయాలని ఆ డిజైనర్ కోరినట్లు అమృత వెల్లడించారు. ఇలా తరుచు కలిసేందని ఫిర్యాదు పేర్కొన్నారు. ఈ క్రమంలోన తన తండ్రిపై ఉన్న కేసును ఎత్తేవేసేందుకు కోటి రూపాయల ఆశజూపినట్లు అమృతా ఫడ్నవీస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, సదరు మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..