మోదీకి అమిత్ షా అభినందన… ఎందుకంటే?

|

Oct 07, 2020 | 2:26 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని.. ఆయన సహచరుడు, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అభినందించారు. ఈ మేరకు అమిత్ షా బుధవారం ట్విట్టర్‌లో పలు ట్వీట్లను పోస్టు చేశారు.

మోదీకి అమిత్ షా అభినందన... ఎందుకంటే?
Follow us on

Amithshah congragulates Narendra Modi:  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని.. ఆయన సహచరుడు, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అభినందించారు. ఈ మేరకు అమిత్ షా బుధవారం ట్విట్టర్‌లో పలు ట్వీట్లను పోస్టు చేశారు. అక్టోబర్ 7వ తేదీ భారత దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజుగా అమిత్ షా పేర్కొన్నారు. మోదీ సారథ్యం దేశానికి కొత్త దశను, దిశను ఇస్తోందని ఆయన తన ట్వీట్లలో ప్రస్తావించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 7వ తేదీతో ప్రజా పరిపాలనలో 20వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రపంచ చరిత్రలో వరుసగా 20 ఏళ్ళ పాటు ప్రజా పరిపాలన రంగంలో కొనసాగిన ఏకైక వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా ప్రజా పరిపాలనలో 20 ఏళ్ళు (రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గాను, రెండు విడతలు అమెరికా అధ్యక్షునిగాను) పూర్తి చేసుకున్నప్పటికీ ఆయన మధ్యలో బ్రేక్ తీసుకున్నారు.

నరేంద్ర మోదీ అక్టోబర్ 7, 2001లో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాతి సంవత్సరమే గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగ్గా.. మోదీ సారథ్యంలోనే మరోసారి బీజేపీ అధికారం చేపట్టింది. ఆ తర్వాత 2007, 2012 ఎన్నికల్లోను మోదీ విజయఢంకా మోగించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా విస్తృత ప్రచారం చేశారు.

2014 ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ మోదీని ప్రధానిని చేసింది. దాంతో ముఖ్యమంత్రి నుంచి నేరుగా ప్రధాని అయిన రికార్డు సృష్టించారు నరేంద్ర మోదీ. ఈ అంశాలన్నింటినీ తన ట్వీట్లలో ప్రస్తావించిన అమిత్ షా.. మోదీ పరిపాలనలో దేశం ముందడుగు వేస్తోందని అన్నారు.