షాకింగ్ న్యూస్: దేశంలో 16 నిమిషాలకు ఒక రేప్.!

నిర్భయ చట్టం ఉన్నా.. దిశ చట్టం వచ్చినా.. కామాంధుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(NCRB) విడుదల చేసిన...

షాకింగ్ న్యూస్: దేశంలో 16 నిమిషాలకు ఒక రేప్.!
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 07, 2020 | 8:34 PM

NCRB Report: నిర్భయ చట్టం ఉన్నా.. దిశ చట్టం వచ్చినా.. కామాంధుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(NCRB) విడుదల చేసిన నివేదికలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మహిళలకు, బాలికలకు దేశంలోని ఏ రాష్ట్రమూ సురక్షితం కాదని ఎన్‌సీఆర్‌బీ స్పష్టం చేసింది. 2018తో పోలిస్తే 2019లో మహిళలపై నేరాలు 7.3 శాతం గణనీయంగా పెరిగాయని.. 4,05,861 కేసులు నమోదైనట్లు నివేదిక పేర్కొంది.

భారత్‌లో ప్రతి 16 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోందని.. 2019లో దేశవ్యాప్తంగా 32,033 రేప్ కేసులు నమోదైతే అందులో 11% దళిత వర్గాలలోనే జరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) వెల్లడించింది. అటు నేరాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. 2019లో రాజస్థాన్‌లో 5,997 రేప్ కేసులు నమోదు కాగా.. అందులో 1313 కేసులు మైనర్ బాలికలపై జరిగిన దాడులుగా నివేదిక వెల్లడించింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో 3,065 రేప్ కేసులు నమోదయ్యాయి. ఇక 2020 ఆగష్టు వరకు రాజస్థాన్‌లో 3498 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. మరోవైపు 2018తో పోలిస్తే 2019లో కిడ్నాపింగ్ కేసులు 0.7 శాతం తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. 2018లో 1,05,734 కేసులు నమోదు కాగా.. 2019లో మొత్తంగా 1,05,037 కేసులు నమోదయ్యాయి.

కాగా, యావత్ దేశాన్నే కదిలించి వేసిన నిర్భయ, దిశ సంఘటనలు..ప్రస్తుతం మరో సంచలనంగా మారి రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతున్న హత్రాస్ సంఘటనలు మహిళల రక్షణకే పెను సవాల్‌గా మారాయి. ఇటువంటి దారుణాలు జరిగిన వెంటనే ప్రభుత్వాలు, రక్షణ వ్యవస్థలు త్వరగా స్పందించి, నేరస్తులకు తగిన శిక్షలు విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృత్తం కాకుండా ఉండేందుకు కఠినమైన చట్టాలు రావాల్సి ఉందంటూ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read:

ఏపీలో స్కూల్స్ రీ-ఓపెన్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.!

అభ్యర్థులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్.. దరఖాస్తుకు మరోసారి అవకాశం.!

అఫీషియల్: అక్టోబర్ 30న కాజల్- గౌతమ్‌ల పెళ్లి..

అక్టోబర్ 15న సినిమా థియేటర్ల రీ-ఓపెన్.. మార్గదర్శకాలు జారీ..

బిగ్ బాస్: అభిజిత్ సారీ చెప్పాడు.. మోనాల్ అఖిల్‌కు హగ్ ఇచ్చింది!

సన్‌రైజర్స్ జట్టులోకి తెలుగు తేజం.. భువనేశ్వర్ స్థానంలో..