అమితాబ్, అమీర్ పేర్ల మీద ఉన్న కార్లకు భారీ ఫైన్.. కేజీఎఫ్ ట్విస్ట్ ఏంటంటే..?

అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్‌ల పేరు మీద ఉన్న కార్లకు బెంగళూరు అధికారులు భారీ జరిమానా విధించారు. రెండు కార్లకు కలిపి రూ.38లక్షలకు పైగా ఫైన్ విధించారు. అంత పెద్ద స్టార్ హీరోలు పన్ను చెల్లించలేదా..? అని అనుకుంటున్నారా..? కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది..? అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అమితాబ్, అమీర్ పేర్ల మీద ఉన్న కార్లకు భారీ ఫైన్.. కేజీఎఫ్ ట్విస్ట్ ఏంటంటే..?
Amitabh Bachchan, Aamir Khan

Updated on: Jul 23, 2025 | 8:09 PM

బాలీవుడ్ సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ పేర్ల మీద ఉన్న లగ్జరీ కార్లకు అధికారులు భారీ ఫైన్ విధించారు. ట్యాక్స్ కట్టకపోవడంతో ఓ కారుకు రూ.18 లక్షలు, మరో కారుకు రూ.19 లక్షలకు పైగా ఫైన్ పడింది. అదేంటీ..? అంత పెద్ద హీరోలు ట్యాక్స్ కట్టలేదా అంటే.. కట్టలేదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..? కార్లు వాళ్ల పేర్ల మీద మాత్రమే ఉన్నవి.. కానీ వాడేది మరొకరు. అవును ఓ వ్యక్తికి కార్లు అంటే మోజు. ఆ మోజుతోనే స్టార్ హీరోల వద్ద కార్లు కొనుగోలు చేశాడు. కానీ వాటికి ఎటువంటి ట్యాక్స్ కట్టలేదు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ట్యాక్స్ చెల్లించకపోవడంతో ఆయా కార్లకు భారీ జరిమానా విధించారు.

వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు అయిన యూసుఫ్ షరీఫ్‌ వద్ద చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. సెలబ్రిటీలు ఉపయోగించే కార్ల పట్ల పిచ్చి ప్రేమ కురిపించే అతడు.. అమితాబ్ బచ్చన్ నుండి MH 11 AX 1 రోల్స్ రాయిస్, ఆమిర్ ఖాన్ నుంచి MH 02 BB 2 రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు. అతను కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రాంతానికి చెందినవాడు కావడంతో అంతా అతడిని కేజీఎఫ్ బాబు అంటారు. కానీ వాటిని తన పేరు మీదికి మార్చుకోలేదు. అంతేకాకుండా ఆ కార్లకు కర్ణాటకలో పన్ను చెల్లించకపోవడంతో బెంగళూరు అధికారులు రూ.18 లక్షల 53వేలు, రూ.19.73 లక్షల జరిమానా విధించారు. వెంటనే కట్టకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు.

అధికారుల ఫైన్‌పై కేజీఎఫ్ బాబు వెంటనే రియాక్ట్ య్యారు. డీడీ ద్వారా ఆర్టీఓ అధికారులకు పన్ను చెల్లించారు. తనకు తెలియకుండానే తప్పు జరిగిందని కేజీఎఫ్ బాబు అన్నారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో రెండు రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయని.. దానికి సంబంధించి కర్ణాటకలో పన్ను చెల్లించాలని తనకు తెలియదన్నారు. అలా తెలియకుండానే తప్పు జరిగిందని.. బాధ్యతగల పౌరుడిగా అధికారులు చెప్పిన వెంటనే ఫైన్ చెల్లించినట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..