ఆలయంలో విధ్వంసంపై షా సీరియస్.. ఢిల్లీ పోలీసులకు సమన్లు

దేశ రాజధాని ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో సోమవారం ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియ‌స్ అయ్యారు. ఢిల్లీ పోలీసు క‌మీష‌న‌ర్ అమూల్య ప‌ట్నాయ‌క్‌‌ను వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఓ కారు పార్కింగ్ విషయంలో మొదలైన చిన్న గొడవ కాస్త.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేసింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న దేవాలయంలో ఓ వర్గం వారు బీభత్సాన్ని సృష్టించారు. లోపల ఉన్న విగ్రహాల్ని ధ్వంసం చేశారు. […]

ఆలయంలో విధ్వంసంపై షా సీరియస్.. ఢిల్లీ పోలీసులకు సమన్లు

Edited By:

Updated on: Jul 03, 2019 | 4:43 PM

దేశ రాజధాని ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో సోమవారం ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియ‌స్ అయ్యారు. ఢిల్లీ పోలీసు క‌మీష‌న‌ర్ అమూల్య ప‌ట్నాయ‌క్‌‌ను వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఓ కారు పార్కింగ్ విషయంలో మొదలైన చిన్న గొడవ కాస్త.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేసింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న దేవాలయంలో ఓ వర్గం వారు బీభత్సాన్ని సృష్టించారు. లోపల ఉన్న విగ్రహాల్ని ధ్వంసం చేశారు. చాందినీ చౌక్‌లోని హౌజ్ ఖ్వాజీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. మందిరంలో బీభత్సం సృష్టించిన ఘటనంతా అక్కడే ఉన్న సీసీఫుటేజీలో రికార్డయ్యింది. దీంతో ఈ వీడియో ఆధారంగా నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఓ మైనర్ కూడా ఉన్నట్లు చెప్పారు.

కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ ఘటనాస్థలిని సందర్శించారు. జరిగిన ఘటన దురదృష్టకరమని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుడదని అన్నారు. ఇక ఇదే అంశంపై బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. సమాజంలో మత విద్వేషాలు రెచ్చగోట్టేందుకే ఇలాంటి దారుణాలకు పాల్పడతారని మండిపడ్డారు. ఇలాంటి వారిని ఉపేక్షించకూడదని.. ఇలాంటి సమయంలో ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు.