ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ బహుముఖ పోటీ జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఈసారి విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి. బీజేపీ కూడా సంకీర్ణ భాగస్వామి NPPతో విడిపోయి సింగిల్‌గానే ఎన్నికల బరిలోకి దూకనుంది. మరోవైపు 2018లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. ప్రత్యక్ష పార్టీల లొసుగులను నిశీతంగా పరిశీలిస్తోన్న బీజేపీ మళ్లీ అధికార పీఠం చేజిక్కించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈక్రమంలో కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా మేఘాలయలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డాలు, రంగసకోనాలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ పై విరుచుకుపడ్డారు. కాన్రాడ్ సంగ్మా ప్రభుత్వం అవినీతి కూపంలో మురికిపోయిందని విమర్శించారు. మేఘాలయను మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించేది కేవలం బీజేపీనేనని పునరుద్ఘాటించారు. మేఘాలయ మాజీ ముఖ్యమంత్రులు ఎప్పుడూ ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టలేదని, బదులుగా వారి కుటుంబాలు, వ్యక్తిగత అభివృద్ధి కోసమే పాటు పడుతున్నారని మండిపడ్డారు.
‘కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల అభివృద్ధిని కోరుకుంటోంది. ఇందులో భాగంగా పలు సంక్షేమ పథకాలు, రాయితీలు అందిస్తోంది.అయితే మేఘాలయ ప్రజలకు మాత్రం ఆ సంక్షేమ ఫలాలు అందడం లేదు. దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రే. ఇక్కడి ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. అసోం, త్రిపుర, మణిపూర్‌లలో మెరిట్‌తో ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. కానీ మేఘాలయలో మాత్రం అలా జరగడం లేదు. ఉద్యోగ నియామకాల్లో అవినీతి ఏరులై పారుతోంది. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారి నిర్మాణానికి రూ. 5,000 కోట్లు ఖర్చు చేశాం. కానీ ఇక్కడ సరైన రహదారి లేదు. మేఘాలయను అభివృద్ధి పథంలో నడవాలంటే మళ్లీ బీజేపీ అధికారంలోకి రావాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సకల సౌకర్యాలు పొందాలంటే ఇక్కడి ప్రభుత్వాన్ని మార్చండి.. బీజేపీకి ఓటు వేసి మా పార్టీ అభ్యర్థులను గెలిపించండి.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సౌకర్యాలు అందరికీ చేరుతాయి’ అని అమిత్‌షా తెలిపారు. కాగా మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా, మార్చి 2న కౌంటింగ్ జరగనుంది.
Dalu, Garo Hills, Meghalaya | People in Assam, Tripura, Manipur getting govt jobs on merit. But in Meghalaya no govt job without corruption. We expended Rs 5,000 cr for construction of national highway in North-East, but no proper highway made here: HM, Amit Shah pic.twitter.com/UEGCVuPGyS
— ANI (@ANI) February 17, 2023
మరిన్ని జాతీయ వార్తల కోెసం క్లిక్ చేయండి..