BJP: టార్గెట్‌ 2024..! హ్యాట్రిక్‌ విక్టరీ కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్.. అగ్రనేతలకు ‘షా’ దిశానిర్దేశం..

|

Sep 07, 2022 | 7:22 AM

2019 సార్వత్రిక ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిన 144 నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్‌. 144 సీట్లను గ్రూపులుగా విభజించి, కేంద్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

BJP: టార్గెట్‌ 2024..! హ్యాట్రిక్‌ విక్టరీ కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్.. అగ్రనేతలకు ‘షా’ దిశానిర్దేశం..
Amit Shah
Follow us on

BJP Action Plan Meet: ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ అగ్రనేతల కీలక సమావేశం జరిగింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి 24 మంది కేంద్రమంత్రులు హాజరయ్యారు. మిషన్ 2024లో భాగంగా ప్రధాని మోడీ ఆధ్వర్యంలో వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిన 144 నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్‌. 144 సీట్లను గ్రూపులుగా విభజించి, కేంద్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పటికే పర్యటించింది మంత్రుల బృందం. ఆయా ప్రాంతాల్లో గెలుపు గుర్రాలను గుర్తించి నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. మంత్రుల బృందం గుర్తించిన అంశాలు, లోపాలు, బలాలు, బలహీనతలపై సమావేశంలో లోతుగా సమీక్ష జరుపుతున్నారు. మంత్రులిచ్చే సమాచారంతో విజయానికి బ్లూ-ప్రింట్ తయారు చేస్తున్నారు. ఈసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది కమల దళం. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాల్ని పన్నుతోంది. బలహీనంగా ఉన్న చోట్ల ఎలా ముందుకెళ్లాలి..? ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేయాలన్న దానిపై ఫోకస్‌ పెట్టింది బీజేపీ అధిష్ఠానం. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠతకు ప్రణాళికల్ని రచిస్తోంది.

అయితే.. 2019లో పార్టీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సీట్లలో గట్టి వ్యూహాలను అవలంభించాలని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. గతం కంటే ఈ సారి ఎక్కువ సీట్లు గెలవాలని.. 2024 ఎన్నికల్లో 2019లో ఓడిపోయిన సీట్లలో 50 శాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అమిత్ షా చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా.. 2019లో 543 లోక్‌సభ స్థానాలకు గాను 303 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఒక పార్టీకి సొంతంగా భారీ మెజారిటీ వచ్చింది. అయితే.. 100 సీట్లకు పైగా విపక్షాలు గెలుపొందగా, కాంగ్రెస్‌కు అత్యధికంగా 53 సీట్లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..