COVID Cases: ఢిల్లీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. కీలక నిర్ణయం తీసుకోనున్న కేజ్రీవాల్ సర్కార్..!
COVID Cases: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఒక వైపు కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో కేసులు పెరుగుతుండటంతో, మరో వైపు భారత్‌లో కూడా మెల్లమెల్లగా కేసులు పెరిగిపోతున్నాయి. ఇక ఢిల్లీలో ఎన్‌సీఆర్‌లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఇక బహిరంగ ప్రదేశాలలో ఫేస్‌మాస్క్‌లు ధరించనందున విధిస్తున్న జరిమానాను ఎత్తివేయాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) మనుపటి నిర్ణయాన్ని పునరాలోచించాలని యోచిస్తోంది. నగరంలో కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి డీడీఎంఏ సమావేశం నిర్వహించి ఏప్రిల్ 20న […]
COVID Cases: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఒక వైపు కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో కేసులు పెరుగుతుండటంతో, మరో వైపు భారత్‌లో కూడా మెల్లమెల్లగా కేసులు పెరిగిపోతున్నాయి. ఇక ఢిల్లీలో ఎన్‌సీఆర్‌లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఇక బహిరంగ ప్రదేశాలలో ఫేస్‌మాస్క్‌లు ధరించనందున విధిస్తున్న జరిమానాను ఎత్తివేయాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) మనుపటి నిర్ణయాన్ని పునరాలోచించాలని యోచిస్తోంది. నగరంలో కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి డీడీఎంఏ సమావేశం నిర్వహించి ఏప్రిల్ 20న తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియ, చీఫ్ సెక్రటరీ విజయ్ దేవ్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.
అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని, మాస్క్‌లు ధరించడం మళ్లీ తప్పనిసరి చేయాలని వ్యాపారులు డీడీఎంఏను కోరుతున్నారు. ఇటీవల మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని తీసుకున్న నిర్ణయం తొందరపాటు నిర్ణయమని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో ఫేస్ మాస్క్‌లు ధరించని వ్యక్తులపై ఇకపై జరిమానా విధించబడదని ఢిల్లీ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుండి కేసుల పెరుగుదల ఉన్నప్పటికీ చాలా మంది దీనిని ఉపయోగించడం మానేశారు. దేశ రాజధానిలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని వారికి 500 రూపాయల జరిమానా విధించారు.
అంతేకాకుండా, దేశంలో తాజా ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిన దృష్ట్యా కోవిడ్ నియంత్రణ చర్యలను ఎత్తివేయాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. గురువారం కోవిడ్ -19 325 తాజా కేసులు నమోదయ్యాయి. బుధవారం నాటి సంఖ్యతో పోలిస్తే 26 కేసులు పెరిగాయి. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. కోవిడ్ నుంచి 224 మంది రోగులు కోలుకున్నారు. అయితే ఢిల్లీలో కోవిడ్ కేసులపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య తక్కువగా ఉన్నందున ఎలాంటి భయం అవసరం లేదని అన్నారు.
ఇవి కూడా చదవండి: