కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత జీవిత బీమా సంస్థ (LIC)కి డెత్ క్లైమ్స్ భారీగా పెరిగాయి. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2020-21 సంవత్సరంలో డెత్ క్లైమ్స్ ఏకంగా 17 శాతం పెరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ సంఖ్య గత ఐదేళ్ల కాలంలోనే గరిష్ఠ స్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీకి 9.75 లక్షల డెత్ క్లైమ్స్ రాగా..2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 11.47 లక్షల డెత్ క్లైమ్స్ వచ్చాయని తెలిపింది. మునుపటి సంవత్సరపు క్లైమ్స్‌ను కూడా కలుపుకుని మొత్తం 11.42 డెత్ క్లైమ్స్‌ను సెటిల్ చేసినట్లు వెల్లడించింది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.24,195.01 కోట్ల డెత్ క్లైమ్స్ పాలసీదారుల నామినీలకు చెల్లించినట్లు వివరించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో డెత్ క్లైమ్స్ కింద ఎల్ఐసీ రూ.17.419.57 కోట్లు చెల్లించింది. కాగా ఆ సంవత్సరంలో 9.32 లక్షల క్లైమ్స్‌ను ఎల్ఐసీ సెటిల్ చేసింది.
2020 జూన్ 30తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసంలో డెత్ క్లైమ్స్ అత్యధికంగా వచ్చాయి. ఆ సమయంలో సెకండ్ వేవ్ కారణంగా దేశంలో భారీ సంఖ్యలో మరణాలు సంభవించడం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగానే ఎల్‌ఐసీకి డెత్ క్లైమ్స్ మునుపెన్నడూ లేని స్థాయిలో పెరిగినట్లు తెలుస్తోంది. అయితే పాలసీదారులు ఏ కారణాలతో అత్యధికంగా మరణించారు? డెత్ క్లైమ్స్ పెరగడానికి కారణాలు ఏంటో? ఎల్ఐసీ వెల్లడించలేదు. అటు ప్రైవేటు బీమా సంస్థలు సైతం 2020-21 ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసంలో డెత్ క్లైమ్స్ దాదాపు రెండింతలు పెరిగినట్లు వెల్లడించాయి.
Also Read..
థర్డ్ వేవ్ ప్రభావమేనా..? పిల్లలపై కరోనా పంజా.. ఆ నగరంలోని తల్లిదండ్రుల్లో ఆందోళన