Amarnath Yatra: అమర్నాథ్ యాత్రలో ఇద్దరు రాజమండ్రి వాసులు గల్లంతు.. గాలిస్తున్నామన్న అధికారులు

|

Jul 11, 2022 | 1:22 PM

తూర్పుగోదావరి జిల్లా నుంచి జిల్లా నుంచి అమర్నాథ్ యాత్రకు 20 మంది భక్తులు వెళ్లారని.. వీరిలో ఇద్దరు యాత్రికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని కలెక్టర్ మాధవీలత తెలిపారు.

Amarnath Yatra: అమర్నాథ్ యాత్రలో ఇద్దరు రాజమండ్రి వాసులు గల్లంతు.. గాలిస్తున్నామన్న అధికారులు
Amarnath Yatra Tragedy
Follow us on

Amarnath Yatra: జమ్మూకశ్మీర్‌లోని (Jammu and Kashmir) అమర్‌నాథ్‌ లో మూడు రోజుల క్రితం భారీ వర్షం బీభత్సం సృష్టించింది.  మంచు లింగం రూపంలో భక్తులతో పూజలను అందుకుంటున్న పవిత్ర గుహ సమీపంలో శుక్రవారం సాయంత్రం భారీ వార్తల కారణంగా వరద పోటెత్తింది. ఆ వరదల్లో చిక్కుకుని పలువురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో యాత్రికులు గల్లంతయ్యారని ఎన్డీఆర్ ఎఫ్ బృందం పేర్కొంది. గల్లంతైన వారికోసం సహాయ చర్యలు చేపట్టారు. అయితే ఇలా గల్లంతైన ప్రయాణికుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తులు ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే..

తూర్పుగోదావరి జిల్లా నుంచి జిల్లా నుంచి అమర్నాథ్ యాత్రకు 20 మంది భక్తులు వెళ్లారని.. వీరిలో ఇద్దరు యాత్రికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని కలెక్టర్ మాధవీలత తెలిపారు. గల్లంతైన ఇద్దరు భక్తులు మహిళలని.. ఇద్దరూ రాజమండ్రికి చెందిన మహిళలే అని చెప్పారు. గల్లంతైన వారు రాజమండ్రి అన్నపూర్ణమ్మపేట కు చెందిన కొత్త పార్వతి, కుమారీ టాకీస్ ఏరియాకు చెందిన మునిశెట్టి సుధలు గా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆయితే తమ కళ్ళ ఎదుటే వరద ఉధృతికి ఓ వృద్ధురాలు కొట్టుకుపోయిందని తోటి యాత్రికులు, కుటుంబ సభ్యులు చెప్పారు.

స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవడానికి .. AP యాత్రికుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం AP భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్‌ను శ్రీనగర్‌కు పంపిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..